- ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీత భత్యాలు ఇవ్వకుండా కుంటి సాకులు చెప్పడం సబబుకాదు
- ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఉద్యమంలో సీపీఐ పాల్గొంటుంది
- సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
చిత్తూరు కలెక్టరేట్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ. ఉద్యోగులు వారి హక్కుల పై పోరాడితే పోలీసులతో దాడి చేయిస్తారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీ మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఆంబోతులుగా తిరిగే వారిని సలహాదారులుగా నియమించుకున్నారని విమర్శించారు నారాయణ. అక్షరాస్యులు మీద దాడులు చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడులు చేయడమేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు ఇవ్వకుండా, ఆర్థిక పరిస్థితులు బాగోలేదని కుంటి సాకులు చెప్పడం సబబు కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ప్రత్యక్ష ఉద్యమంలో సీపీఐ పాల్గొంటుందని హెచ్చరించారు సీపీఐ నారాయణ.
అంతకుముందు చిత్తూరు కలెక్టరేట్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగిన ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో యూటీఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ రమణ తీవ్రంగా గాయపడ్డారు.
ఉద్యోగుల పీఆర్సీ జీవోపై హైకోర్టులో పిటిషన్
మరోవైపు సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై....ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కె.వి. కృష్ణయ్య కోర్టును ఆశ్రయించారు. ఉద్యోగుల పీఆర్సీ జీవోపై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విభజన చట్టం ప్రకారం ఎలాంటి బెనిఫిట్స్ తగ్గకూడదని పిటిషన్ లో వివరించారు కృష్ణయ్య. సెక్షన్ 78 (1) కి విరుద్ధంగా ఉన్న జీవో 1ని రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు.
ఇవి కూడా చదవండి
AP:PRC వ్యతిరేక ఆందోళనలపై స్పందించిన మంత్రి
ఏపీలో ఇవాళ కరోనా కేసులు 12,615.. ఐదుగురి మృతి
సమాజాన్ని ఎదిరించి.. ఫైన్ కట్టి కూతురిని చదివించింది
ఎమ్మెల్యేను తరిమికొట్టిన గ్రామస్థులు