- కొత్తగూడెంలో జర్నలిస్టులు నిరసన
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : మీడియాపై దాడులు రోజురోజుకు పెరుగుతుండడం దారుణమని టీయూడబ్ల్యూజే( ఐకేయూ) జిల్లా అధ్యక్షుడు ఏమంది ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షుడు కనుకు వెంకటేశ్వర్లు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియాపై అధికార గుండాల దాడి నిరసిస్తూ జిల్లా కేంద్రమైన కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లకు పై వైసీపీ గుండాలు దాడులకు తెగబడడం అన్యాయమన్నారు. పత్రికా కార్యాలయాలపై దాడులు చేయడం దారుణమన్నారు. విలేకరులపై దాడులు ఆపకపోతే రెండు రాష్ట్రాల్లో దశల వారీగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు సుధాకర్, రాజేందర్, ఈశ్వర్, లక్ష్మణ్, ప్రతాప్, గుణ సురేశ్, జంపన్న పాల్గొన్నారు.