జన్నారం, వెలుగు : జన్నారం మండలంలోని కామన్ పెల్లి, కవ్వాల, బంగారుతండా, కిష్టాపూర్ గ్రామాల్లో గురువారం నాటు సారా స్థావరాలపై లక్సెట్టిపేట ఎక్సైజ్ సీఐ నర్సింహులు అద్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. కామన్ పెల్లిలో ఆమృతబాయి ఇంటి వద్ద తయారు చేస్తున్న 5 లీటర్లు,అదే గ్రామంలో భుక్యా లక్ష్మన్ వద్ద 5 లీటర్లు
కవ్వాల గ్రామంలో నాటు సారా తయారు చేస్తున్న బుచ్యవ అనే మహిళ వద్ద 5 లీటర్ల నాటు సారాను సాధీనం చేసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. నాటు సారా తయారు చేసిన,విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ నర్సింహులు తెలిపారు.ఈ దాడుల్లో మంచిర్యాల ఎన్పోర్స్ మెంట్ సీఐ గంగారెడ్డి,లక్సెట్టిపేట ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.