![రాంబాగ్ ఆలయానికి అయోధ్య శ్రీరాముడి అక్షింతలు](https://static.v6velugu.com/uploads/2023/12/attapur-rambagh-temple-ayodhya-shri-ram-axes_Em7V4MqbQu.jpg)
గండిపేట, వెలుగు : అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి అక్షింతలు మంగళవారం అత్తాపూర్‌కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అక్షింతల కలశాలను వీధులు, బస్తీల్లో నుంచి రాంబాగ్ రామాలయానికి తీసుకువచ్చారు. మంగళవాయిద్యాలు, జై శ్రీరామ్ నినాదాలతో ఈ పవిత్ర యాత్ర సాగింది. రాజేంద్రనగర్‌లోని అతి పురాతనమైన ఆలయంలో సుమారు 9 కలశాలకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం శోభాయాత్ర నిర్వహించారు.
ఈ క్రమంలో పలువురు భక్తులు అక్షింత కలశాన్ని నమస్కరించి హారతులతో స్వాగతం పలికారు. అనంతరం చిన్న అనంతగిరి శివాలయంలో, స్థానిక ఇతర ఆలయాల్లో కలశాన్ని ఉంచారు. కలశం లోపల ఉన్న అక్షింతలను రామ మందిరం ప్రాణ ప్రతిష్ట రోజులోగా స్థానికులందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు.