
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు పెను ప్రమాదం తప్పింది. బుధవారం (ఏప్రిల్ 16) గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించేందుకు దిలావర్ నగర్-రహీమాబాద్ స్టేషన్ల మధ్య పట్టాలపై ఒక భారీ చెక్కను పెట్టారు గుర్తు తెలియని దుండగులు. ఇది గమనించిన కాశీ విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్ లోకో పైలెట్ వెంటనే అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. గరీబ్ రథ్ రైలును మలిహాబాద్ స్టేషన్‌లోనే ఆపేశారు. దీంతో గరీబ్ రథ్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది.
స్థానిక పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలో ట్రాక్‌పై మొద్దుతో పాటు రామ్ నామ్ అని రాసిన ఒక క్లాత్, మామిడి చెట్ల కొమ్మలను గుర్తించారు. వెంటనే ట్రాక్ మీద నుంచి చెక్క మొద్దను తొలగించి.. సంఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు రహీమాబాద్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
►ALSO READ | Mamata Banerjee: ముర్షిదాబాద్ అల్లర్లు..మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు: మమతా బెనర్జీ
ఆర్‌పీఎఫ్, యూపీ పోలీసుల సంయుక్త బృందం ఈ ఘటనపై దర్యాప్తు మొదలైంది. ట్రాక్‌పై దొరికిన వస్తువులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ట్రాక్‌పై మొద్దును పెట్టిన వ్యక్తులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పడంతో అధికారులు, రైల్వే సిబ్బంది, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.