
హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సెక్యూరిటీ లేకుండానే పోస్టల్ బ్యాలెట్ బాక్సులను శనివారం రాత్రి ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలిస్తుండగా కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. సుమారు 1,849 ఓట్లు ఉన్న 20 బాక్సులను సెక్యూరిటీ లేకుండానే ఎన్నికల సిబ్బంది వ్యాన్‌లోకి ఎక్కిస్తుండడంతో కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు. సెక్యూరిటీ పెట్టి బాక్సులను తరలించాలని పట్టుబట్టారు.
తర్వాత రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేశారు. కేంద్ర బలగాలను పంపిస్తామని ఆయన చెప్పినా రాత్రి 9 గంటల వరకూ పంపలేదు. చివరికి స్థానిక పోలీసులు రావడంతో బ్యాలెట్ బాక్సులను సిద్దిపేటకు తరలించారు. వారి వెంట కాంగ్రెస్ కార్యకర్తలు సిద్దిపేట వరకు వెళ్లారు. అక్కడ స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచే దాకా ఉన్నారు.