హైదరాబాద్: నెరేడ్ మెట్ క్రాస్ రోడ్డులో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం చోరీకి గుర్తు తెలియని దుండగులు విఫలయత్నం చేశారు. ఏటీఎం మిషిన్ ను పగులగొట్టేందుకు విశ్వప్రయత్నం చేశారు. చివరకు మిసన్ తెరచుకోకపోవడంతో వదిలేసి వెళ్లిపోయారు. ఉదయమే ఈ ఏటీఎంలో డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన కస్టమర్లు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే బ్యాంకర్లతోపాటు.. ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేసిన వారిని పిలిపించి విచారించారు. ఏటీఎంను పాక్షికంగా ధ్వంసం చేసినట్లు కనిపిస్తోంది. ఏటీఎంలో ఉన్న డబ్బులు ఏమి పోలేదని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగులను పట్టుకునేందుకు విచారణ జరుపుతున్నారు.
For More News..
మంత్రి కొడుకు జీతం కోసం నన్ను బలిచేశారు.. మహబూబాబాద్ సర్కారు డాక్టర్ కన్నీళ్లు
డిప్రెషన్‌లో చాలా రకాలున్నయ్.. లైఫ్ స్టైల్, మనస్తత్వాన్ని బట్టి లక్షణాలు
లోడ్ చార్జీల పేర ట్రాన్స్‌కో వడ్డింపులు