- వృద్ధుడి అరెస్ట్ .. పోక్సో కేసు నమోదు
షాద్‌నగర్, వెలుగు: చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన వృద్ధుడిపై షాద్ నగర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ ప్రతాప లింగం తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌కు చెందిన ఓ బాలిక(4) ఆదివారం ఉదయం ఆడుకోవడానికి బయటికెళ్లింది. దగ్గరలోని ఇంటి వద్ద ఉండే అనుపటి పెంటయ్య(66) అనే వృద్ధుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికను దగ్గరికి పిలిచాడు.
ఆ తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లి చిన్నారిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఇంటికి తిరిగొచ్చిన బాలిక జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. బాలిక తల్లి షాద్ నగర్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. పెంటయ్యపై పోక్సో కేసు ఫైల్ చేసి అతడిని అరెస్ట్ చేసినట్లు సీఐ ప్రతాప లింగం తెలిపారు.
Also Read : హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా ఫణీంద్ర రెడ్డి