
ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం రూరల్ మండలంలోని ఓ గ్రామంలో ఆరేండ్ల పాపపై ఓ కామాంధుడు ఆదివారం అత్యాచార యత్నం చేశాడు. బోయినపల్లి వీరబాబు(35) అనే వ్యక్తి తన ఇంటి పక్కన బజారులో ఆడుకుంటున్న ఓ పాపను ఎత్తుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. భయపడిన పాప ప్రతిఘటించగా గాయపరిచాడు. చిన్నారి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి నిందితుడిని పట్టుకొని చితకబాదారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.