ప్రముఖ నటుడు మోహన్ బాబు(Mohan Babu)పై కేసు నమోదైంది. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీసులు BNS యాక్ట్ కింద 109 అటెమ్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు. మొదట 118 (1) సెక్షన్ నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకుని ఇపుడు సెక్షన్ మార్చి 109 కింద కేసు నమోదు చేశారు.
కుటుంబ వివాదం నేపథ్యంలో మంగళవారం జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద జరుగుతోన్న పరిస్థితులను కవరేజ్ చేసేందుకు వచ్చిన జర్నలిస్టులపై భౌతిక దాడులకు దిగాడు. ఏకంగా జర్నలిస్టుల చేతిలో మైకును లాక్కునే వారిపైనే దాడి చేశాడు.
ఈ క్రమంలో ఓ జర్నలిస్టు చేతిలో నుంచి మోహన్‌బాబు మైకు లాక్కుని ముఖంపై కొట్టారు. దీంతో జర్నలిస్ట్ లు ఆందోళనకు దిగడంతో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.