4 నెలల గర్భిణీపై లైంగిక దాడికి యత్నం.. కేకలు వేయడంతో ట్రైన్ నుంచి తోసేసిన దుండగులు

4 నెలల గర్భిణీపై లైంగిక దాడికి యత్నం.. కేకలు వేయడంతో ట్రైన్ నుంచి తోసేసిన దుండగులు

చెన్నై: తమిళనాడులో సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకంది. ట్రైన్‎లో ప్రయాణిస్తోన్న నాలుగు నెలల గర్భిణీపై దుండగులు లైంగిక దాడికి యత్నించారు. మహిళ ప్రతిఘటించడంతో కనీస కనీకరం లేకుండా రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకు తోసేశారు. ఈ ఘటన కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుని తమిళనాడులోని అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. వివరాల ప్రకారం..  ఓ నాలుగు నెలల గర్భిణీ కోయంబత్తూరులోని బట్టల దుకాణంలో పని చేస్తోంది. పని నిమిత్తం గురువారం (ఫిబ్రవరి 6) కోయంబత్తూరు నుంచి చిత్తూరు వెళ్లేందుకు ట్రైన్ ఎక్కింది. 

ఈ క్రమంలో తిరుపత్తూరు జిల్లాలోని జోలార్‌పేట సమీపంలో ఇద్దరు వ్యక్తులు గర్భిణీ మహిళ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ట్రైన్‎లో వాష్ రూమ్‎కు వెళ్తుండగా అడ్డు్కుని లైంగిక దాడికి యత్నించారు. దాడి నుంచి తీవ్రంగా ప్రతిఘటించిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో భయాందోళనకు గురైన నిందితులు.. మహిళలను రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకు తోసేశారు. గమనించిన తోటి ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని వెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Also Read :- అనుమతులు లేని బిల్డింగ్​ లే కాదు.. హోర్డింగ్​లు కూడా కూలుస్తాం

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జోలార్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైల్వే పోలీసులు నిందితులను గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు.హేమరాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి స్పందించారు.  ‘‘ఒక గర్భిణీ స్త్రీని ఇద్దరు పురుషులు లైంగికంగా వేధించి రన్నింగ్ ట్రైన్ నుంచి తోసేశారనే వార్త దిగ్భ్రాంతికరం. 

తమిళనాడులో మహిళలు రోడ్డుపై సురక్షితంగా నడవలేకపోతున్నారు. పాఠశాలలు, కళాశాలలు లేదా కార్యాలయాలకు వెళ్లలేకపోతున్నారు. ఇప్పుడు రైలులో కూడా మహిళలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు. ఇది చాలా అవమానకరం. డీఎంకే ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత లేదనడానికి ఈ ఘటనే  నిదర్శనం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని పళనిస్వామి పేర్కొన్నారు.