ఇంజనీరింగ్ ప్రాక్టికల్స్ ఇంటి దగ్గరి కాలేజీల్లోనే

ఇంజనీరింగ్ ప్రాక్టికల్స్ ఇంటి దగ్గరి కాలేజీల్లోనే

కొన్ని సబ్జెక్టుల పరీక్షలకు ఆన్‌లైన్‌లోనూ ఛాన్స్  జేఎన్టీయూహెచ్ ​నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: కరోనా నేపథ్యంలో జేఎన్టీయూహెచ్​ కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌‌కు స్టూడెంట్స్​ ఇంటికి దగ్గరలో ఉన్న కాలేజీల్లో అటెండ్‌ అయ్యే ఛాన్స్‌‌ ఇచ్చింది. దీంతో ప్రాక్టికల్‌‌ ఎగ్జామ్స్‌‌కు వారు చదువుకునే కాలేజీకే రావలసిన పనిలేదు. ఇంటి దగ్గరలో ఉండే కాలేజీల్లోనే ప్రాక్టికల్‌‌ ఎగ్జామ్స్‌‌ రాయవచ్చు. స్టేట్‌‌లో జేఎన్టీయూ పరిధిలో 157 ఇంజనీరింగ్‌‌ కాలేజీలు ఉన్నాయి. ప్రస్తుతం ఫస్ట్‌‌ ఇయర్‌‌‌‌ మినహా అందరికీ ఆన్‌‌లైన్‌‌ క్లాసులే జరుగుతున్నాయి. ఇప్పటికే 45 నుంచి 50 శాతం సిలబస్‌‌ కూడా కంప్లీట్‌‌ అయింది. అటానమస్‌‌ కాలేజీల్లో 92%, మిగిలిన కాలేజీల్లో 72% వరకు స్టూడెంట్స్‌‌ హాజరవుతున్నారని యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. కరోనా తీవ్రత కొనసాగుతున్నందున ప్రాక్టికల్‌‌ ఎగ్జామ్స్‌‌ నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టారు. హాస్టల్స్‌‌ రీ ఓపెన్‌‌ కాకపోవడం, ట్రాన్స్‌‌పోర్ట్‌‌ ఫెసిలిటీస్‌‌ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంలో ప్రాక్టికల్‌‌ ఎగ్జామ్స్‌‌కు స్టూడెంట్స్‌‌ హాజరవ్వడం కష్టమే. దీంతో డిసెంబర్‌‌‌‌, జనవరి నెలల్లో జరగాల్సిన ఇంజినీరింగ్‌‌ ప్రాక్టికల్‌‌ ఎగ్జామ్స్‌‌ను స్టూడెంట్స్‌‌ ఇంటికి దగ్గరగా ఉన్న కాలేజీల్లోనే నిర్వహించే వెసులుబాటు ఇవ్వాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. దీంతో పాటు, ప్రాక్టికల్‌‌ ఎగ్జామ్స్‌‌ ఆన్‌‌లైన్‌‌లో కూడా నిర్వహించే విషయాన్ని కూడా వర్సిటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆన్‌‌లైన్‌‌ క్లాసులకు అటెండ్‌‌ కానివారికి స్పెషల్‌‌ క్లాసులు కండక్ట్‌‌ చేయాలని వర్సిటీ రిజిస్ట్రార్‌‌‌‌ మంజూర్‌‌‌‌ హుస్సేన్‌‌ కాలేజీలకు సూచించారని ‘వెలుగు’తో చెప్పారు. దీన్ని రెగ్యులర్‌‌‌‌ అటెండెన్స్‌‌గా పరిగణిస్తామన్నారు. ఇంటర్నెట్‌‌, కరెంట్‌‌ సమస్యల కారణంగా ఆన్‌‌లైన్‌‌ క్లాసులు మిస్సవుతున్న స్టూడెంట్స్‌‌ దగ్గరలో ఉన్న కాలేజీల్లో ఆన్‌‌లైన్‌‌ క్లాసులు అటెండ్‌‌ అయ్యేందుకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు.

For More News..

చాన్స్​ ఇస్తే 7 ఏండ్లలో చేయలేనిది 7 నెల్లలో చేసి చూపిస్తా..

సెనేటర్‌‌‌‌గా గెలిచిన ట్రాన్స్‌‌జెండర్‌‌‌‌

కరోనాపై పత్రికల పోరాటం.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పత్రికా రంగం