- గ్రూప్ పరీక్షలపట్ల అభ్యర్థుల అనాసక్తి
- గ్రూప్1 కంటే తగ్గిన గ్రూప్ 2, 3 అటెండెన్స్
- ఎగ్జామ్స్ నిర్వహణ ఏర్పాట్లు వృథా
గ్రూప్ ఎగ్జామ్స్రాయడానికి అప్లికేషన్లు పెట్టడంలో నిరుద్యోగ యువత చూపుతున్న ఆసక్తి పరీక్ష రాసేటైంకు ఢీలా పడుతోంది. ఎగ్జామ్ ఫీజు కట్టి హాల్‌టికెట్ పొందేవరకు ఉన్నఉత్సాహం జాబ్ సాధించే వరకు ఉండటం లేదు. అభ్యర్థుల సంఖ్యలకు అనుగుణంగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు వృథా అవుతున్నాయి. ఎగ్జామ్సెంటర్ల కోసం జిల్లాలో స్కూల్స్క్లోజ్చేయడంతో సహా ఇన్విలిజేషన్ సిబ్బంది నియామకం, వెహికల్స్, పోలీసుల డ్యూటీ అంతా వృథా అవుతోంది.
నిజామాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో వివిధ జాబ్నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీలను పట్టించుకోలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. పోస్టులకు అనుగుణంగా నోటిఫికేషన్లు ఇస్తూ పరీక్షలు నిర్వహిస్తూ, మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తోంది. ఈనెల 15, 16 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-2 ఎగ్జామ్‌కు 19,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
వారికి హాల్ టికెట్స్కూడా జారీ చేశారు. అయితే ఫస్ట్ పేపర్‌కు 9,070 మంది, సెకండ్పేపర్కు 9,020, థర్డ్పేపర్కు 8,915, నాలుగో పేపర్‌కు 8,911 అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అటెండెన్స్45 శాతంగా నమోదైంది. అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్నందున స్కూల్స్ ను క్లోజ్ చేసి 63 సెంటర్లు ఏర్పాటు చేశారు. 12 రూట్లు ఏర్పాటు చేసి, ఆఫీసర్లకు వెహికల్స్అరెంజ్ చేశారు. ఇద్దరు రీజనల్ ఇన్విజిలేటర్లు, 63 మంది చొప్పున ఇన్విజిలేటర్లు, సిట్టింగ్స్క్వాడ్ను వందలాది పోలీసుల బందోబస్తు మధ్య పరీక్షలు నిర్వహించారు. ఇంత మంది సిబ్బందితో నిర్వహించిన పరీక్షలకు అభ్యర్థులు సగానికి పైగా రాయలేదు.
గత నెల నవంబర్17, 18 తేదీలలో గ్రూప్-3 ఎగ్జామ్ నిర్వహించారు. దరఖాస్తు చేసుకున్న 19,941అభ్యర్థులు హాల్‌టికెట్లు పొందారు. ఫస్ట్ పేపర్ పరీక్షకు 10,037 మంది అభ్యర్థులు, సెకండ్ పేపర్‌కు 9,992, థర్డ్ పేపర్ వచ్చేసరికి 9,880 మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు. సమగ్ర కుటుంబ సర్వే కొనసాగిస్తూనే ఆఫీసర్లు గ్రూప్-3 పరీక్ష కోసం నిర్వహణకు స్టాఫ్‌ను సర్దుబాటు చేశారు.
జూన్ 9న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు 12,833 మంది హాల్ టికెట్లు పొంది 9,948 మంది అభ్యర్థులే హాజరయ్యారు. 2,888 మంది గైర్హాజరు కారణంగా వారి కోసం చేసిన ఏర్పాట్లు వేస్ట్ అయ్యాయి. పార్లమెంట్ ఎలక్షన్ కౌంటింగ్ ముగిసి ఈవీఎం బాక్స్‌లను భద్రపర్చే టైంలో జరిగిన గ్రూప్-1 పరీక్ష నిర్వహణను చాలెంజ్‌గా తీసుకొని ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. అప్పటికే రెండుసార్లు ప్రిలిమ్స్రిజల్టు రద్దయినందున పకడ్బందీ నిర్వహించారు. వేల సంఖ్యలో అప్లికేషన్లు పెడుతున్న అభ్యర్థులు పరీక్ష రాసే టైం వచ్చేసరికి ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశమవుతోంది.
ఉత్సాహంగా ప్రిపేర్ అవుతున్న సమయంలో గత ప్రభుత్వం ఎగ్జామ్ నిర్వహణలో జాప్యంచేయడంతో యువత నిరుత్సాహానికి లోనైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్రిజల్ట్స్ రెండుసార్లు రద్దు కావడంతో మరింత డీలాపడ్డారు. పరిణామాలను పక్కబెట్టి సాధించే పట్టుదలతో ఉన్న అభ్యర్థులు మాత్రమే పరీక్షలు రాస్తున్నారు. మరికొందరిలో ప్రిపరేషన్‌తో పాటు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపం కూడా ఎగ్జామ్స్ దాకా వెళ్లనీయడంలేదు.