అందరి ఫోకస్ ఇందూరు పైనే…

అందరి ఫోకస్ ఇందూరు పైనే…

నిజామాబాద్:   వెలుగు: దేశమంతా ఇప్పుడు ఇందూరు వైపే చూస్తోంది. ఈ లోక్‌ సభ సెగ్మెంట్‌ లో దేశంలోనే అత్యధికంగా 185 మంది అభ్యర్థులు బరిలో నిలవడం.. వారిలో 176 మంది పసుపు, ఎర్రజొన్న రైతులే ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.గురువారం జరిగే పోలింగ్ కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సెగ్మెంట్ పరిధిలో మొత్తం1,788పోలింగ్ స్టేషన్లు, 15,53,301 ఓటర్లున్నారు. ప్రత్యేక పరిస్థితులున్నం దున ఇక్కడ ఎన్ని కల నిర్వహణకు ఈసీ స్పెషల్ మాన్యువల్ జారీ చేసింది. దేశంలో తొలిసారిగా ఎం3 మోడల్ ఈవీఎంలను వినియోగిస్తోంది.నోటాతో కలిపి మొత్తం 186 గుర్తులను ఈవీఎంలపై పొందుపరిచారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎం బ్యాలెట్​ యూనిట్లను అమర్చారు. కంట్రోల్ యూనిట్‌ కు,వీవీప్యాట్‌ కు వీటిని లింక్​ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎల్ ఆకారంలో ఓటింగ్ కంపార్ట్ మెంట్​ సిద్ధం చేశారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలోఉండటంతో ఏ బ్యాలెట్ యూనిట్లో ఏయే అభ్యర్థులున్నారో ఓటర్లు తెలుసుకునేందుకు వీలుగా పోలింగ్ స్టేషన్ల వద్ద గుర్తుల బోర్డును ఏర్పాటు చేశారు. 185మంది పోలింగ్ ఏజెంట్లు నియమించుకునే అవకాశం ఉండటంతో పరిస్థితిని బట్టి వారి కోసం పోలింగ్  కేంద్రాల వద్ద టెంట్లను , షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులకు సైన్ లాంగ్వే జ్, బ్రెయిలీ లిపిలోబ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఎం3 మోడల్ ఈవీఎంలు వినియోగిస్తున్నందున సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరిం చేందుకు బీఈఎల్, ఈసీఐఎల్ సంస్థలకు చెందిన600 మంది ఇంజనీర్లు, టెక్నీషియన్లను అందుబా-టులో ఉంచారు. 5–6 పోలింగ్ స్టేషన్లకు ఓ సెక్టోరల్ అధికారి, ఓ ఇంజనీరుకు బాధ్యతలిచ్చారు. హెలికాప్టర్ సేవలను వినియోగిం చుకునేందుకు వీలుగా ఏడుచోట్ల ప్రత్యేకంగా హెలీప్యాడ్లను సిద్ధం చేశారు.

8 గంటల నుంచి పోలింగ్

మిగతా ప్రాంతాలకు భిన్నంగా నిజామాబాద్‌ నియోజకవర్గంలో ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 వరకు కొనసాగుతుం ది. ఆరింటిలోపు క్యూలైన్ లో ఉన్న వారిని ఓటేసేందుకు అనుమతిస్తారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున ఉదయం 6 గంటల్లోపే మాక్‍ పోలింగ్ ప్రారంభించి 8 గంటలలోపు పూర్తి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ రావు తెలిపా రు. బుధవారం సాయంత్రానికి అన్ని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు,పోలింగ్ సిబ్బంది చేరుకున్నట్లు తెలిపా రు. ఎన్నికకు26 వేల బ్యాలెట్ యూనిట్లు , 2,150 కంట్రోల్యూనిట్లు , మరో 2150 వీవీప్యాట్లు ఉపయోగిస్తున్నారు. పోలింగ్ నిర్వహణకు సుమారు 12 వేల మంది సిబ్బంది, 700 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకుపోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు4 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు.సివిల్ పోలీస్, ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీసులు, సీఏపీఎఫ్,ఎస్‍ఏపీఎఫ్, ఇతర రాష్ట్రా ల బలగాలు రంగంలోకిదిగాయి. అన్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ ల బయటసీసీ కెమెరా లు ఏర్పాటు చేశారు.

మహిళా ఓటర్లే కీలకం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రైతుల పోరాటంతో జాతీయ స్థాయిలో దృష్టి పడిన నిజామాబాద్​ లోక్​సభ స్థానంలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. 185 మంది బరిలో ఉన్న ఈ సెగ్మెంట్​లోముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు, 176 మంది రైతులు పోటీ చేస్తున్నారు. గురువారం పోలింగ్‌‌‌‌ జరుగుతోంది. ఇక్కడ మహిళా ఓటర్లు ఎవరివైపుమొగ్గుచూపితే వాళ్లే గెలి చే అవకాశాలున్నాయి.

76,112 మంది ఎక్కువ

నిజామాబాద్‌ లోక్‌ సభ పరిధిలో పురుషుల ఓటర్లకంటే మహిళా ఓటర్ల సంఖ్య 76,112 మేరఎక్కువగా ఉంది. లోక్‌ సభ పరిధిలో జగిత్యా ల,కోరుట్ల, బాల్కొండ, ఆర్మూర్‌‌‌‌, బోధన్‌‌‌‌, నిజామాబాద్‌ అర్బన్‌‌‌‌, నిజమాబాద్‌ రూరల్‌‌‌‌ అసెంబ్లీ సెగ్మెంట్లు న్నాయి. వీటన్నింటిలోనూ మహిళా ఓటర్లేఎక్కువ. మొత్తంగా 15,53,301 మంది ఓటర్లుం -టే 7,38,577 మంది పురుషులు, 8,14,689మంది మహిళలు, 35 మంది ఇతరులు ఉన్నారు.మహిళా ఓటర్లలో లక్షన్నర మంది వరకు బీడీకార్మి కులే.రైతుల పోరాటంతో జాతీయ స్థాయిలో దృష్టి పడిన నిజామాబాద్​ లోక్​సభ స్థానంలో మహిళా ఓటర్లు కీలకం కానున్నారు. 185 మంది బరిలో ఉన్న ఈ సెగ్మెంట్​లోముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థులు, 176 మందిరైతులు పోటీ చేస్తున్నారు. గురువారం పోలింగ్‌‌‌‌ జరుగుతోం ది. ఇక్కడ మహిళా ఓటర్లు ఎవరివైపుమొగ్గుచూపితే వాళ్లే గెలి చే అవకాశాలున్నాయి.76,112 మంది ఎక్కువనిజామాబాద్‌ లోక్‌ సభ పరిధిలో పురుషుల ఓటర్లకంటే మహిళా ఓటర్ల సంఖ్య 76,112 మేరఎక్కువగా ఉంది. లోక్‌ సభ పరిధిలో జగిత్యా ల,కోరుట్ల, బాల్కొండ, ఆర్మూర్‌‌‌‌, బోధన్‌‌‌‌, నిజామాబాద్‌ అర్బన్‌‌‌‌, నిజమాబాద్‌ రూరల్‌‌‌‌ అసెంబ్లీ సెగ్మెంట్లు న్నాయి. వీటన్నింటిలోనూ మహిళా ఓటర్లేఎక్కువ. మొత్తంగా 15,53,301 మంది ఓటర్లుంటే 7,38,577 మంది పురుషులు, 8,14,689మంది మహిళలు, 35 మంది ఇతరులు ఉన్నారు.మహిళా ఓటర్లలో లక్షన్నర మంది వరకు బీడీకార్మి కులే.

 

నిజామాబాద్‌‌‌‌ లోక్‌ సభ పరిధిలో ఓటర్ల వివరాలు

సెగ్మెంట్‌‌‌‌                                     మొత్తం ఓటర్లు                     మహిళలు                         పురుషులు

జగిత్యాల                                     2,13,901                            1,10,162                      1,03,736

నిజామాబాద్‌‌‌‌ అర్బన్‌                       2,69,028                          1,37,738                      1,31,272

నిజామాబాద్‌‌‌‌ రూరల్‌‌‌‌                     2,36,620                              1,26,511                     1,10,107

ఆర్మూర్‌‌‌‌                                     1,92,706                             1,02,704                       89,997

బాల్కొం డ                                 2,06,383                                1,11,458                     94,921

బోధన్‌                                       2,07,379                                1,07,463                    99,913

కోరుట్ల                                      2,27,284                                 1,18,653                    1,08,631

మొత్తం                                     15,53,301                              8,14,689                    7,38,577