మల్కాజిగిరిలో ఉంటున్నారా..? అయితే జర జాగ్రత్త.. ఎందుకంటే..

మల్కాజిగిరిలో ఉంటున్నారా..? అయితే జర జాగ్రత్త.. ఎందుకంటే..

మేడ్చల్-మల్కాజిగిరి: మల్కాజిగిరిలో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ హల్చల్ చేసింది. దృష్టి మరల్చి మొబైల్ ఫోన్లు చోరీ చేసిన ఘటనలు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం (అక్టోబర్ 20, 2024) ఆనంద్ బాగ్లో పాల కోసం వెళ్లిన వ్యక్తి వద్ద నుంచి అందరూ చూస్తుండగానే దర్జాగా పాకెట్లో నుంచి దుండగులు ఫోన్ కొట్టేసి జంప్ అయిపోయారు. ఈస్ట్ ఆనంద్ బాగ్లోని మార్కెట్కు వెళ్లిన మరో వ్యక్తి వద్ద నుంచి కూడా మొబైల్ చోరీ చేశారు. మొత్తం రెండు చోట్ల ఇద్దరు వ్యక్తుల  వద్ద నుంచి మొబైల్ ఫోన్లు కొట్టేసినట్లు తెలిసింది.

 

ఈ అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ ఒక పక్కా ప్లాన్ ప్రకారం మొబైల్స్ కొట్టేస్తున్నారు. ‘ నీ డబ్బులు కింద పడ్డాయి’ అని చెప్పి ఆ వ్యక్తి దృష్టి మరల్చి  జేబులో ఉన్న మొబైల్ ఫోన్లు చోరీ చేశారు. అప్పటికే బండి స్టార్ట్ చేసి ఇద్దరు యువకులు వెయిటింగ్లో ఉండగా  వారి బండిపై ఎక్కి నిందితుడు పరారైనట్లు బాధితుడు మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ నగరంలో అపరిచితుల వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ALSO READ | రాయదుర్గం నాలెడ్జి సిటీలో అర్థరాత్రి బైక్ రేసింగ్

రెండేళ్ల క్రితం కూడా ఇలానే..
2022లో తక్కువ ధరకు గోల్డ్​అమ్మకాల పేరుతో అరకోటికి పైగా కొట్టేసిన అంతర్రాష్ట్ర అటెన్షన్​ డైవర్షన్​ గ్యాంగ్ను రాచకొండ పోలీసులు అప్పట్లో అరెస్టు చేశారు. ఆ ఘటన ఏంటంటే.. విద్యానగర్లో ఉంటున్న మహేశ్​​(35) రియల్​ఎస్టేట్​ బ్రోకర్. సరూర్​నగర్లో ఉంటున్న వ్యాపారి, రియల్​ఎస్టేట్ బ్రోకర్​తాళ్లూరి వెంకటేశ్వర రావుతో మహేశ్కు పరిచయం ఉంది. తనకు పరిచయం ఉన్న వ్యక్తుల వద్ద 1.5కిలోల బంగారం ఉందని, తక్కువ ధరకు అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారని వెంకటేశ్వర​రావుకు మహేశ్​ చెప్పాడు.  బంగారం కొనాలనుకుంటే రూ.60 లక్షలు సిద్ధం చేసుకోవాలన్నాడు. మహేశ్ మాటలు నమ్మిన వెంకటేశ్వరరావు 1.5 కిలోల బంగారం కొనడానికి రూ. 60 లక్షలు ఏర్పాటు చేశాడు.

ఆ తర్వాత ఒకరోజు వెంకటేశ్వరరావుకు మహేశ్​ ఫోన్​ చేసి దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్‌ వద్ద కలుస్తానని చెప్పాడు.  అదే రోజు సాయత్రం 3 గంటలకు మళ్లీ ఫోన్ చేసి 1.5 కిలోల బంగారంతో కనకరాజు, ప్రసన్న అనే ఇద్దరు వ్యక్తులను ఇంటికి పంపిస్తున్నట్టు చెప్పాడు. అనంతరం ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వెంకటేశ్వరరావు ఇంటికి వచ్చారు. అతడిని మాటల్లో పెట్టి రూ.60 లక్షలు ఉన్న బ్యాగ్ తీసుకున్నారు. తర్వాత అంతకు ముందే తమ వెంట తెచ్చుకున్న అలాంటి ఓ బ్యాగ్ను అతడికి ఇచ్చి 1.5 కిలోల బంగారం తీసుకుని వస్తామని చెప్పి వెళ్లిపోయారు.

వెంకటేశ్వరరావును మాటల్లో పెట్టిన  ఆ ఇద్దరు వ్యక్తులు బ్యాగ్ను మార్చి డబ్బులు తీసుకెళ్లిపోయారు. వాళ్లు వెంకటేశ్వరరావుకు ఇచ్చిన బ్యాగ్లో రంగుల కాగితాలు ఉండటంతో బాధితుడు మహేశ్కు కాల్ చేయగా.. స్విచాఫ్ వచ్చింది. దీంతో వెంకటేశ్వరరావు సరూర్​నగర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. విద్యానగర్‌లోని మహేశ్ ఇంట్లో నిందితులున్నట్లు సమాచారం  అందుకుని అక్కడ దాడులు చేశారు. మహేశ్తో పాటు అంతర్రాష్ట్ర గ్యాంగ్కు చెందిన రియాజ్, వనేష్​కుమార్, కనకరాజు, రవి సురేందర్, షేక్​ సైదులు, అనుమోలు సైదులును అదుపులోకి తీసుకున్నారు.