యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అందరికీ గుర్తే ఉంటుంది. బుల్లితెర మెగాస్టార్ నటుడు ప్రభాకర్ కొడుకే చంద్రహాస్. 2024లో తన డెబ్యూ మూవీతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చాడు ఈ యువ హీరో. గతేడాది అక్టోబర్ 4న రామ్‍నగర్ నగర్ బన్నీ అనే మూవీతో వచ్చి అలరించాడు. అయితే, ఈ మూవీ రిలీజ్‍కు ముందే ప్రమోషనల్ ఈవెంట్లలో చూపించిన జోరు.. సినిమాలో లేకపోవడంతో థియేటర్లలో పెద్దగా ఆడలేదు.ప్రమోషన్ ఈవెంట్ లలో చంద్రహాస్ యాటిట్యూడ్ కు సోషల్ మీడియాలో ట్రోలింగ్ గట్టిగా జరగడంతో సినిమాపై బజ్ ఏర్పడింది. కానీ, అది సినిమాకు ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు.
రామ్‍నగర్ నగర్ బన్నీ ఓటీటీ:
రామ్‍నగర్ నగర్ బన్నీ మూవీ ఆహా ఓటీటీలో అడుగుపెట్టనుంది. శుక్రవారం జనవరి 17 నుంచి రామ్‍నగర్ నగర్ బన్నీ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం హీరో చంద్రహాస్ తన కొత్త సినిమా షురూ చేశాడు. ‘బరాబర్ ప్రేమిస్తా’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సంపత్ రుద్ర దర్శకత్వంలో గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మేఘనా ముఖర్జీ హీరోయిన్.
Relationships, responsibilities, and redemption—Attitude star's emotional rollercoaster begins on from Jan 17 #RamNagarBunny @parkyprabhakar #Chandrahass@DivijaPrabhakar @vismayasri #RichaJoshi #ambikavani @Rithumanthra @iammadhunandan #ActorSameer #aslisaleempheku… pic.twitter.com/klP7FtkTjB
— ahavideoin (@ahavideoIN) January 14, 2025
రామ్నగర్ బన్నీ కథేంటి?
రామ్‌నగర్ ఏరియాకు చెందిన బన్నీ (చంద్రహాస్)కి స్నేహితులతో కలిసి తిరగడమే పని. అలా రామ్‌నగర్ బన్నీగా పిలువబడతాడు. అతనికి లేడీస్ వీక్‌నెస్. చూసిన ప్రతి అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ప్రేమ కహానీ నడిపిస్తాడు. ఊహించని రీతిలో.. నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ ఓ వివాహితకు మాటిచ్చి, ఆమె కంపెనీలో చేరతాడు. అమ్మాయిల వరకు అయితే ఏదో అనుకోవచ్చు. పెళ్లి చేసుకుంటానని ఆంటీకి మాటిస్తాడు. అయితే, ఈమెపై తనకు ఎలాంటి ఇష్టం లేదని, తను నిజంగా ప్రేమిస్తుందని శైలు(విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. ఇలాంటి బన్నీ జీవితంలో వచ్చిన మార్పేంటీ? చెప్పినట్టే వివాహితను పెళ్లి చేసుకున్నాడా? ప్రేమించిన అమ్మాయిని చేసుకున్నాడా? చివరకు బన్నీ, శైలు ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.