కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడండి : అత్తు ఇమామ్

కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడండి : అత్తు ఇమామ్

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట అర్బన్ మండలం  పొన్నాల గ్రామంలోని సర్వే నంబర్ 21లో 18 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోందని దాన్ని కాపాడాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్ధిపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్ వెనక విలువైన 18 గుంటల భూమిని మాజీ సర్పంచ్ రెవెన్యూ అధికారి సహకారంతో కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.

మూడు లక్షలకు 60 గజాల ప్లాట్ చొప్పున 24 ప్లాట్లు అమ్ముకుని కట్టడాలు ప్రారంభించారని తెలిపారు. ఈ డబ్బులను రెవెన్యూ అధికారి, మాజీ సర్పంచ్ లు పంచుకున్నారని ఆరోపించారు.  ఈ విషయంపై కలెక్టర్ దృష్టిపెట్టి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారి పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.