దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు అందరికీ గుర్తుండే ఉంటుంది. పెళ్లి, పిల్లలు అంటూ అందరిలా ఎన్నో కలలు కన్న ఈ టెకీ అర్ధాంతరంగా తనువు చాలించారు. భార్య వేధింపులు.. పోలీసుల విచారణలు.. న్యాయస్థానాల తీర్పులు.. తనను కష్టాల సుడిగుండం నుండి బయటపడేయలేవు అనుకున్న అతుల్ శుభాష్ ఆత్మహత్య చేసుకున్నారు. భార్య తనను ఎంతలా వేధించిందో.. తాను పడ్డ కష్టాలేంటో అన్నీ సవివరంగా 24 పేజీల లేఖలో రాసి మరీ ప్రాణాలు తీసుకున్నాడు.
అతుల్ సుభాష్ ఆత్మహత్యతో అతని నాలుగేళ్ల కుమారుడి బాధ్యతలు ఎవరికీ అప్పగించాలనే దానిపై తీవ్ర చర్చ జరిగింది. పిల్లాడిని తమకు అప్పగించండి అని అతుల్ సుభాష్ తల్లి సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో ఈ వ్యవహారం నడిచింది. అతుల్ కుమారుడి కస్టడీ కోరుతూ తల్లి అంజు దేవి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిల్లాడి కస్టడీకి అతుల్ సుభాష్ భార్య నికితా సింఘానియాకే అప్పగించింది.
Also Read : జమ్మూ కాశ్మీర్లో ఎన్ కౌంటర్
బాలుడి ఆచూకీ సమాచారాన్ని నికితా దాచిపెట్టిందని పిల్లాడి అమ్మమ్మ అంజు దేవి చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. అమ్మమ్మ తన మనవడిని సందర్శించగలిగినప్పటికీ, బిడ్డ తల్లితో కలిసి ఉండటమే శ్రేయస్కరమని తీర్పు ఇచ్చారు. జస్టిస్‌లు బివి నాగరత్న, ఎస్‌సి శర్మలు ఈ తీర్పు వెలువరించారు. న్యాయమూర్తులు ఈ నిర్ణయం తీసుకునే ముందు వీడియోలో బాలుడితో మాట్లాడారు. బాలుడు తల్లితో ఉండటానికే ఇష్టపడినట్లు తెలుస్తోంది.
ఇక అతుల్ సుభాష్ కుమారుడు ఎక్కుడున్నరనే దానిపై కోర్టు ఆరా తీయగా.. బాలుడిని హర్యానాలోని ఫరీదాబాద్‌లోని బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారని, అయితే తల్లితో పాటు బెంగళూరుకు వెళ్లేందుకు అతన్ని వెనక్కి తీసుకుంటారని సింఘానియా తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.