బెంగళూరు టెకీ సూసైడ్ కేసు..మనవడికోసం సుప్రీంకోర్డుకు అతుల్ సుభాష్ తల్లి

బెంగళూరు టెకీ సూసైడ్ కేసు..మనవడికోసం సుప్రీంకోర్డుకు అతుల్ సుభాష్ తల్లి

బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ తల్లి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన 4యేళ్ల మనవడిని అప్పగించాలని సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. సుభాష్ తల్లి అంజూ మోదీ.. తన మనవడిని అప్పగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ ను దాఖలు చేసింది. 

తన కొడుకు చనిపోయినప్పటినుంచి మనవడు కనిపించకుండా పోయాడని పిటిషన్ లో  పేర్కింది.  పోలీసుల కస్టడీలో ఉన్న అతుల్ సుభాష్ భార్య నిఖిత సింఘానియా, ఆమె కుటుంబ సభ్యులు తన మనవడి ఆచూకి చెప్పడంలేదని తెలిపింది. 

అతుల్ సుభాష్ కుమారుడి ఆచూకీ విషయంలో అతుల్ భార్య నిఖిత సింఘానియా, ఆమె మేనమామ చెప్పిన విషయాల్లో పొంతన లేదని తన మనవడి ఆచూకీ తెలుసుకొని తనకు అప్పగించాలని కోర్టును కోరింది.

బాలుడిని ఫరీదాబాద్ లోని ఓ స్కూల్ చేర్పించినట్లు, నిఖిత సింఘానియా మేనమామ సుశీల్ సింఘానికి కస్టడీలో ఉన్నాడని తెలుస్తోంది..అయితే చిన్నారి ఆచూకీ తనకి తెలియదని సుశీల్ కొట్టపారేస్తున్నాడు. 

Also Read :- మహిళా మంత్రిపై ఇంత పచ్చి బూతులా

జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం..ఈ కేసులో మరింత స్పష్టత ఇవ్వాలని ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా వేసింది. 

ఇటీవల అతుల్ సుభాష్ భార్య, అత్తమామల వేధింపులు, తప్పుడు ఆరోపణలను వివరిస్తూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. నిఖితా సింఘానియా, ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్ సింఘానియాలను డిసెంబర్ 16న అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు అతుల్ ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. 

పిటిషన్ ప్రకారం..తన మనవడి ఆచూకీ తెలవకుండా సింఘానియా కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నాని అంజూమోడీ వాదిస్తున్నారు. సుభాష్ తండ్రి పవన్ కుమార్ కూడా మనవడిని వారికి అప్పగించాలని కోరారు. బాలుడి భద్రతపై అతుల్ సుభాష్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.