Atul Subhash: బెంగళూరు టెకీ ఆత్మహత్య కేసు.. అతుల్ సుభాష్ తల్లి సంచలన వ్యాఖ్యలు

Atul Subhash: బెంగళూరు టెకీ ఆత్మహత్య కేసు.. అతుల్ సుభాష్  తల్లి సంచలన వ్యాఖ్యలు

బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది..అతుల్ ఆత్మహత్యకు కారణమైన అతని భార్య, ఆమె బంధువులపై కేసులు నమోదు అయ్యాయి. అతుల్ తన సూసైడ్ నోట్ రాసిన విషయాలు వెల్లడి కావడంతో సుప్రీంకోర్టు జడ్జీలు కూడా ఆశ్చర్యపోయారు. భార్య వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నానని తనకు న్యాయం చేయాలని రాష్ట్రపతికి కూడా లెటర్ రాశాడు. సోషల్ మీడియాలో అతుల్ సూసైడ్ నోట్, వీడియో వైరల్ కావడంతో అతనికి నెటిజన్లు మద్దుతుగా నిలిచారు.  

ఈక్రమంలో అతుల్ సుభాష్ తల్లి.. తన కొడుకు ఆత్మహత్య వెనకాల ఉన్న కారణాలను మీడియాకు చెబుతూ సొమ్మసిల్లి పడిపోయారు.  నా కొడుకును చిత్ర హింస లకు గురి చేశారు..అతుల్ భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడు.. మేం బాధపడతామని ఆ విషయాన్ని అతుల్ మాదగ్గర దాచాడు అని మీడియాలో ఏడుస్తూ తెలిపింది.  తన బాధను మీడియాతో పంచుకునే క్రమంలో బోరున ఏడుస్తూ రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతుల్ తండ్రి కూడా ఆత్మహత్య పై స్పందించాడు.. ‘‘అతుల్ హింసించబడ్డాడు.. మేం బాధపడకూడదని విషయాన్ని దాచిపెట్టాడని ’’ చెప్పాడు. 

ALSO READ | బెంగళూరు AI టెక్కీ సూసైడ్ నోట్.. న్యాయ వ్యవస్థపై రాష్ట్రపతికి రాసిన లేఖలో ఏముంది..?

యూపీకి చెందిన అతుల్ సుభాష్ బెంగళూరులోని తన అపార్టుమెంట్ లో శవమై కనిపించాడు. అతను 24 పేజీ సూసైడ్ నోట్, 1.50 గంటల నిడివి గల వీడియోను సోషల్  మీడియాలో  పోస్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. అసజ శృంగారం, హత్యారోపణలతో అతుల్ పై కేసులు నమోదు చేయడం, భార్య నికిత, ఆమె కుటుంబ సభ్యులు వేధించారని సూసైడ్ లో చెప్పడం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అయితే సుభాష్ అత్త, మామలను ఈ విషయంపై మీడియా అడిగిన ప్రశ్నలను దాట వేశారు. అతుల్ కావలనే మాపై ఆరోపణలు చేశారని అంటున్నారు.