హార్టికల్చర్ వర్సిటీని సందర్శించిన  ఆబర్న్ వర్సిటీ బృందం

హార్టికల్చర్ వర్సిటీని సందర్శించిన  ఆబర్న్ వర్సిటీ బృందం

ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీని  అమెరికాలోని ఆబర్న్ యూనివర్సిటీ బృందం సందర్శించింది.  ఈ సందర్భంగా వర్సిటీ వైస్ ఛాన్స్​లర్​ దండ రాజిరెడ్డితో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్​లర్ దండ రాజిరెడ్డి మాట్లాడుతూ..  అంతర్జాతీయ భాగస్వాములను ప్రోత్సహించడానికి ఈ బృందం వర్సిటీని సందర్శించిందన్నారు. అమెరికా బృంద సభ్యులు హార్టికల్చర్ పీజీ స్టూడెంట్స్‌‌ కు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలోని రిజిస్టర్ భగవాన్, విజయ, శ్రీనివాసన్, సత్యనారాయణ, వీరాంజనేయులు, కిరణ్ కుమార్, అమెరికా నుంచి వచ్చిన బృందం జానకి అలవలపాటి, కాలేజ్ ఆఫ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్ మెంట్ డీన్ గోవింద్ కన్నన్, ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ హెడ్ షినా, వృషాంక్‌‌  రాఘవ్ పాల్గొన్నారు.   హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా లోగో, క్యాలెండర్ ఆవిష్కరణ చేశామహార్టికల్చర్ వర్సిటీని సందర్శించిన  ఆబర్న్ వర్సిటీ బృందంని హార్టికల్చర్ వర్సిటీ వైస్ ఛాన్స్​లర్ దండ రాజిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రిని శాలువాతో  సత్కరించారు.