న్యూఢిల్లీ : ఇండియా డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ యూకీ భాంబ్రీ ఆక్లాండ్‌లో జరుగుతున్న ఏఎస్‌బీ క్లాసిక్ టోర్నమెంట్‌లో తన పోరాటాన్ని ముగించాడు. శుక్రవారం జరిగిన మెన్స్ డబుల్స్ సెమీఫైనల్లో అన్ సీడెడ్ యూకీ–అల్బనో ఒలీవెటి (ఫ్రాన్స్) ద్వయం 3–6, 6–1, 5–10తో టాప్ సీడ్ నికొలా మెక్టిచ్ (క్రొయేషియా)–మైకేల్ వీనస్ (అమెరికా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది.
ఈ టోర్నీలో సెమీస్ చేరడం ద్వారా భాంబ్రీ, ఒలీవెటి చెరో 90 పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. ఇద్దరికీ కలిపి 10,150 యూఎస్ డాలర్ల ప్రైజ్‌మనీ కూడా లభించింది.