కారేపల్లి, వెలుగు : నాటు సారా, బెల్లం తరలిస్తూ పట్టుబడ్డ వాహనాలను ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం వేలం వేశారు. కారేపల్లి క్రాస్ రోడ్ లోని ఎక్సైజ్ కార్యాలయంలో సీజ్ చేసిన తొమ్మిది బైక్ లకు వేలం పాట నిర్వహించారు.
తొమ్మిది వెహికల్స్ను రూ.3.31లక్షలకు వేలం వేశారు. వేలం పాటను ఎక్సైజ్ శాఖ అధికారులు వేణుగోపాల్, జుల్ఫికర్ అహ్మద్, వసంతలక్ష్మి నిర్వహించారు.