- ప్రభుత్వానికి రూ.91.43లక్షల ఆదాయం
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ కమిషనరేట్పరిధిలోని వివిధ కేసుల్లో సీజ్‌చేసి, స్వాధీనం చేసుకున్న గుర్తుతెలియని వెహికల్స్ ను వేలం వేశారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రకు చెందిన 500 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. సిటీ ఆర్ముడ్ రిజర్వ్(సీఏఆర్) హెడ్ క్వార్టర్స్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వేలం కొనసాగింది.
మొత్తం 1,161 వెహికల్స్ ను వేలం వేయగా, వీటిలోని 1,072 టూ వీలర్స్,16 ఆటోలు, 5 కార్లను రూ.80.35 లక్షలకు స్క్రాప్ కింద విక్రయించారు. కండిషన్‌లో ఉన్న 68 టూ వీలర్స్ ను రూ.11.08 లక్షలకు విక్రయించారు. వేలం ద్వారా వచ్చిన రూ.91.43లక్షలను ప్రభుత్వ ట్రెజరీలో డిపాజిట్ చేశారు.