![బాచుపల్లి, మేడిపల్లిలో 209 ప్లాట్ల వేలం](https://static.v6velugu.com/uploads/2023/05/Auction-of-209-plots-in-Bachupally-and-Medipally_DLYPWdmNsf.jpg)
- రూ.260 కోట్ల ఆదాయం
హైదరాబాద్, వెలుగు: బాచుపల్లి, మేడిపల్లిలో ఉన్న 218 ప్లాట్లకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించగా 209 ప్లాట్లు అమ్ముడుపోయాయి. ఈ వేలం ద్వారా రూ.260.29 కోట్ల రెవెన్యూ వచ్చినట్లు హెచ్ఎండీఏ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. బాచుపల్లిలో 133 ప్లాట్లకు గజం రూ. 25 వేలుగా కనీస ధర ఖరారు చేయగా.. వేలంలో గజం రూ.53,500 పలికింది. ఇక మేడిపల్లిలో 78 ప్లాట్లకు గజం రూ. 32వేలుగా ఖరారు చేయగా వేలంలో గజం రేటు రూ.50వేలు పలికిందని అధికారులు పేర్కొన్నారు.