మోకిలలో 60 ప్లాట్ల వేలం.. సర్కారుకు రూ.131.72 కోట్లు ఆదాయం

మోకిలలో 60 ప్లాట్ల వేలం.. సర్కారుకు రూ.131.72 కోట్లు ఆదాయం

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిల ఫేజ్ 2లో గురువారం రెండో రోజు హెచ్ఎండీఏ 60 ప్లాట్లను వేలం వేసింది. ఇందులో మొత్తం ప్లాట్స్ అమ్ముడుపోగా ప్రభుత్వానికి రూ.131.72 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా 591 ప్లాట్ లో గజం రూ.75 వేలు పలకగా, అత్యల్పంగా రూ.56 వేలు పలికింది. యావరేజ్​గా రూ.63,281 ధర పలికిందని హెచ్ఎండీఏ ప్రకటనలో వెల్లడించింది. 
మొత్తం 20,925 గజాలను వేలం వేయగా గజం కనీస ధరను రూ.25వేలుగా ఖరారు చేసింది. శుక్రవారం, సోమవారం, మంగళవారాల్లో మిగిలిన ప్లాట్లను వేలం వేయనున్నారు. మొత్తం 300 ప్లాట్లను 5 రోజుల పాటు రోజుకు 60 ప్లాట్లు వేలం వేస్తున్నారు. రెండో రోజు కూడా ప్లాట్లు కొన్నవారి వివరాలను హెచ్ఎండీఏ వెల్లడించలేదు.