ఆడి కార్ల కంపెనీ.. ఇటలీ దేశం బాస్.. 10 వేల అడుగుల లోయలో పడ్డాడు

ఆడి కార్ల కంపెనీ.. ఇటలీ దేశం బాస్.. 10 వేల అడుగుల లోయలో పడ్డాడు

అతను ఆడి కార్ల కంపెనీలో కీలక వ్యక్తి. ఇటలీ దేశానికే బాస్.. ప్రముఖ పారిశ్రామికవేత్త కూడానూ.. వీకెండ్ రిలాక్స్ కోసం.. ఇటలీ దేశంలోని పర్వతారోణకు వెళ్లాడు.. ఉత్సాహంగా.. ఉల్లాసంగా పర్వతం ఎక్కుతుంటే.. అనుకోకుండా పట్టుతప్పాడు.. అంతే.. 10 వేల అడుగుల లోతుగా ఉన్న లోయలో పడ్డాడు..

ఫాబ్రిజియో లాంగో అనే 62 ఏళ్ల ఆడి కంపెనీ ఇటలీ ఎగ్జిక్యూటివ్ ఆదివారం ఇటాలియన్-, స్విస్ బార్డర్ లో ట్రెక్కింగ్ కు వెళ్లాడు. పర్వతారోహణ సమయంలో 10,000 అడుగుల ఎత్తైన కొండ నుంచి లోయలో పడి మరణించాడు. 2013 నుంచి ఆడి ఇటలీకి ఫ్రాంబ్రిబియో డైరెక్టర్‌గా ఉన్నాడు.

ట్రెక్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అతనిని దురదృష్టం వెంటాడింది. అతనితోపాటు ఉన్న మరో వ్యక్తి ఎమర్జెన్సీ సేవల కోసం సమాచారం ఇచ్చాడు. ఫ్రాంబ్రిజియోని కాపాడటానికి ఓ హెలికాప్టర్ లో టీం వచ్చింది. లాంగో అక్కడిక్కడే చనిపోయినట్లు వారు తెలిపారు. అతని మృతదేహం 700 అడుగుల లోయలో ఇరుక్కుపోయింది. అతని మృతదేహాన్ని సమీపంలోని ఇటాలియన్ టౌన్ కారిసోలోకు తరలించారు. 

Also Read :- టాటా కర్వ్​ వచ్చేసింది

లాంగో 2012లో ఆడి కంపెనీలో  చేరారు. ఒక సంవత్సరం తర్వాత ఆడి కంపెనీ ఇటలీ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. 1987లో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించిన లాంగో ఎంతో మంది బిజినెస్ మ్యాన్లతో సన్నిహితం కలిగి ఉన్నాడు.