పాపం సినీ లవర్స్ దారుణంగా మోసపోయారు. ఒక సినిమా అనుకోని టికెట్స్ బుక్ చేసుకుంటే అది ఆ సినిమా కాదు మరో సినిమా అని తెలిసి షాకవుతున్నారు. అలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఒక థియేటర్ లో ఆరు షోలు ఫుల్ అయ్యే రేంజ్ లో టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ, తరువాత తెలిసిందే అది వాళ్ళు అనుకున్న సినిమా కాదు వేరే సినిమా అని. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమా జూన్ 27న విడుదల అవుతున్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా లెవల్లో భారీగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా చూసేందుకుకే ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో కల్కి సినిమా టికెట్స్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఆన్లైన్ లో టికెట్స్ బుకింగ్ విడుదల చేసింది బుక్ మై షో. దాంతో.. కల్కి సినిమాను ఫస్ట్ డే చూసేయాలని ఆశతో టికెట్స్ కోసం ఎగబడ్డారు ఆడియన్స్.
అయితే.. అదేరోజు కూకట్ పల్లి భ్రమరాంబ లాంటి థియేటర్ లో రాజశేఖర్ హీరోగా వచ్చిన కల్కి సినిమా ప్రదర్శితమవుతోంది. దాంతో.. చాలా మంది కల్కి అని కనిపించేసరికి ఆ సినిమాకు టికెట్స్ బుక్ చేసుకున్నారు. అలా ఆరోజు ఏకంగా ఆరు షోలు ఫుల్ అయ్యాయి. తీరా.. అది ప్రభాస్ సినిమా కాదు రాజశేఖర్ సినిమా అని తెల్సి లబోదిబోమన్నారు. అయితే.. విషయం తెలుసుకున్న బుక్ మై షో ఈ విషయంపై స్పందించింది. ప్రేక్షకులు అదోనళన చెందాల్సిన అవసరం లేదని.. అవే టికెట్లపై ప్రభాస్ కల్కి మూవీ చూడొచ్చని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.