పుష్ప 2 సినిమా చూడటానికి వెళ్లిన ఆడియన్స్ కి షాక్.. డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్..

పుష్ప 2 సినిమా చూడటానికి వెళ్లిన ఆడియన్స్ కి షాక్.. డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్..

టాలీవడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందాన జంటగా నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కాగా పుష్ప 2 రిలీజ్ అయిన మూడు రోజుల్లోమనే దాదాపుగా రూ.621 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసింది. దీంతో ఫాస్ట్ గా ఈ ఫీట్ ని అందుకున్న తొలి సినిమాగా పుష్ప 2 రికార్డులు క్రియేట్ చేసింది. 

అయితే కేరళలోని కొచ్చిలో పుష్ప 2 సినిమా చూడటానికి వెళ్లిన ఆడియన్స్ కి వింత అనుభవం ఎదురైంది. కొచ్చిలోని సినీపోలిస్ సెంటర్ స్క్వేర్ మాల్ థియేటర్‌లో శుక్రవారం పుష్ప 2 సినిమాని ప్రదర్శించారు. ఈక్రమంలో సెకెండాఫ్ ని మొదటగా ప్రసారం చేశారు. మొదటిసారి  ఆడియన్స్ పుష్ప 2 సినిమా చూడటానికి వెళ్లడంతో గుర్తించలేకపోయారు. కానీ ఇంటర్వెల్ సమయానికి  సినిమా పూర్తియి ఎండ్ కార్డు పడటంతో ఒక్కసారిగా ఆడియన్స్ అవాక్కయ్యారు. దీంతో ఆడియన్స్ థియేటర్ యాజమాన్యంతో గొడవకి దిగారు. అలాగే టికెట్ డబ్బు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ALSO READ | Amitabh Allu Arjun: పుష్పను పొగిడిన బిగ్ బీ ..ఆనందంలో అల్లు అర్జున్ రియాక్షన్ చూశారా!

ఇక పుష్ప 2 సినిమాలోని క్యాస్ట్ & క్రూ విషయానికొస్తే ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫజిల్ విలన్ పాత్రలో నటించాడు. జగపతిబాబు, అనసూయ, సునీల్, ధనుంజయ్, తారక్ పొన్నప్ప తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. పుష్ప 3 కూడా ఉంటుందని చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించారు.