ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఎక్కడ చూసినా జై శ్రీరామ్(Jai Sriram), జై హనుమాన్(Jai Hanuman) నినాదాలే వినిపిస్తున్నాయి. ఓపక్క అయోధ్యలో రామ మందిరం(Ayidhya Ram Mandir) ప్రారంబోత్సవానికి సిద్ధమవుతుంటే.. మరోపక్క థియేటర్స్ లో హనుమాన్(HanuMan) సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. సూపర్ హీరో కాన్సెప్ట్ తో దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashanth Varma) తెరకెక్కించిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. తేజ సజ్జ హీరోగా వచ్చిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
హనుమాన్ సినిమా చూసిన ప్రేక్షకులు ప్రశాంత్ వర్మ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా నీ వర్క్ కి, నీ డెడికేషన్ కి, హనుమాన్ ను చూపించిన విధానానికి మేము ఫిదా అంటూ ప్రశంసిస్తున్నారు. దీంతో ప్రశాంత్ వర్మ అనే పేరు ఇప్పుడు బ్రాండ్ గా మారింది. నిజానికి ఈ సంక్రాంతికి ప్రశాంత్ వర్మ చేసింది రిస్క్ అనే చెప్పాలి. హనుమాన్ అనే సూపర్ హీరో కాన్సెప్ట్ పట్టుకొని, ఒక్క స్టార్ లేకుండా ఇంత బజ్ క్రియేట్ చేశాడంటే మాములు విషయం కాదు. నిజానికి ఆయన గట్స్ కి హ్యాట్సాఫ్ చెప్పాలిందే. ఓపక్క మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా గుంటూరు కారం రిలీజ్ అవుతున్నా.. రిలీజ్ చేయడానికి సరైన థియేటర్స్ లేకున్నా తాను నమ్మిన దానికోసం బలంగా నిలబడ్డాడు ప్రశాంత్.
సినిమా రిలీజ్ విషయంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వెనుకడుగేయలేదు. ఆ హనుమంతులవారే తమతో ఉండి ముందుకు నడిపిస్తారని నమ్మాడు.. ఇప్పుడు అదే నిజమయ్యింది. మారుతాయి.. అన్ని లెక్కలు మారుతాయి. రిలీజ్ రోజు హనుమాన్ సినిమాకు థియేటర్స్ లేకుండా చేశారు కానీ, రేపటి నుండి ఏ థియేటర్ లో చూసినా.. హనుమాన్ సినిమానే కనిపిస్తుంది. మొదటిరోజు కలెక్షన్స్ కాస్త తగ్గొచ్చు కానీ, ఓవర్ ఆల్ గా లెక్కలు మాత్రం హనుమాన్ ప్రభంజనం సృష్టించడం ఖాయం. లాంగ్ రన్ లో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టడం పక్కా. ఇక ఫైనల్ గా ఒక్కమాట.. ప్రశాంత్ వర్మ నీ గట్స్కి హ్యాట్సాఫ్.