పర్ఫెక్ట్ పండగ సినిమా చూడాలనే ఉత్సాహం ప్రేక్షకుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఈ సారి సంక్రాంతి పండుగకు చక్కటి ఫ్యామిలీ డ్రామా థియేటర్లోకి వస్తోంది.
విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం (SankranthikiVasthunam) మూవీ జనవరి 14న రిలీజ్ కానుంది. నిన్న జనవరి 6న రిలీజ్ చేసిన ట్రైలర్కి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే సాంగ్స్ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి.
ALSO READ | Daaku Maharaaj: బాలయ్య కెరీర్‌లోనే హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్.. డాకు మహారాజ్ లెక్కలు ఎలా ఉన్నాయంటే?
ఈ నేపథ్యంలో సంక్రాంతి వస్తున్నాం మూవీ చూడటానికి 201K+లైక్స్ తో బుక్ మై షోలో ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. "సంక్రాంతి వస్తున్నాం మూవీపై మీ ఆసక్తిని ఇప్పుడే గుర్తించండి.. మరియు బుకింగ్‌లు తెరిచిన వెంటనే తెలియజేయండి " అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.
The excitement to witness the PERFECT PANDAGA CINEMA is growing with each passing day 😍🥳
— Sri Venkateswara Creations (@SVC_official) January 7, 2025
201K+ interests on @bookmyshow for #SankranthikiVasthunam 💥💥💥
Mark your interest now and get notified as soon as bookings open ❤️🔥
— https://t.co/fWd87TVF5h#సంక్రాంతికివస్తున్నాం… pic.twitter.com/J3GsmsOiZW
ఇకపోతే.. టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడుగా పేరు తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి. ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో సరికొత్త జోనర్ లో తనకు కలిసొచ్చిన కామెడీని పండించే ప్రయత్నం చేస్తున్నట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అర్ధమైపోతుంది. ఒక రెగ్యులర్ ఎంటర్‌టైనర్ లా కాకుండా, ఈసారి పూర్తి భిన్నమైన ఫ్రెష్ కంటెంట్ తో వస్తున్నారని చెప్పకనే చెప్పారు. వెంకీ కామెడీ టైమింగ్ ప్లస్ అయితే కనుక సినిమా విజయం ఏ స్థాయిలో ఉండనుందో ఊహించేసుకోవొచ్చు.