చాటింగ్ చేసేటప్పుడు పేరాలు పేరాలు టైప్ చేయకుండా ఒక్క ఇమోజీతో మనం ఏం చెప్పాలనుకుంటున్నామని అవతలి వాళ్లకు చెప్పేచొచ్చు. నిజానికి మెస్సేజ్ చేసుకునేప్పుడు ఈ ఇమోజీలు చాలా బాగా ఉపయోగపడతాయి. మనం హ్యాపీగా ఉన్నా, బాధగా ఉన్నా, మూడ్ ఆఫ్ గా ఉన్నా, పార్టీ చేసుకుంటున్న టైం అయినా అది ఓ ఇమోజీతో సింపుల్ గా చెప్పేయోచ్చు. వీటికి ఉన్న క్రేజ్ చూసి ఇంకా ఎక్కువ ఇమోజీలు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు కొత్తగా గూగుల్ ఫోన్ యాప్ లో ఆడియో ఇమోజీలు కూడా తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ ఫోన్ యాప్ లో కాల్ చేసుకున్నప్పుడు ఈ ఇమోజీలు మనం యూజ్ చేయవచ్చు.
ఇందులో ఆరు రకాల సౌండ్స్ ఎఫెక్ట్స్ అందుబాటలో ఉంటాయి. అవి డమ్స్ వాయించిన సౌండ్, క్లాప్స్, నవ్వు, పార్టీ సెలబ్రేషన్స్, పూప్, ఏడుస్తున్న సౌండ్ లు యానిమేట్ చేసి ఫోన్ యాప్ ఇంటర్ ఫేస్ లో ఉంటాయి. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ 15 వర్షన్ లో విడుదల చేయనున్నారు. 2024 జూన్ తర్వాత ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. రాబోయే ఆపరేటింగ్ సిస్టమ్‌లో పాస్‌వర్డ్ ఫీల్డ్‌లు లేదా సెన్సిటివ్ ఉన్న స్క్రీన్ షేర్ దాచిపెట్టే ఓ సీక్రెట్ ఫీచర్ కూడా ఉంటుంది. ఫోన్ మాట్లాడుకుంటున్న ఇద్దరూ ఈ సౌండ్ ఎఫెక్ట్స్ వినొచ్చు.ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ సౌండ్స్ బ్యాక్ టూ బ్యాక్ ప్లే చేయొచ్చు.