జగిత్యాల, వెలుగు: బెల్ట్ షాపులకు లిక్కర్ సప్లై చేసే విషయంలో జగిత్యాల జిల్లాలో ఓ ఎక్సైజ్ ఆఫీసర్, బార్ నిర్వాహకుడికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియోలు గురువారం సోషల్ మీడియాలో వైరల్అయ్యాయి. మెట్‌పల్లిలోని బెల్ట్ షాపుల నిర్వాహుకులు వైన్నుంచి కాకుండా ఓ బార్ నుంచి లిక్కర్ బాటిళ్లు తెచ్చుకున్నారు. సేల్స్ పడిపోవడంతో వైన్‌షాపు యజమాని ఈ విషయాన్ని ఎక్సైజ్ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఎక్సైజ్ ఆఫీసర్లు బెల్ట్ షాపులపై దాడులు చేసి బార్లలో లిక్కర్ కొనుగోలు చేయవద్దంటూ హెచ్చరించారు. బెల్ట్‌షాపుల నిర్వాహకులు, ఆ విషయాన్ని బార్యజమానికి చెప్పడంతో అతను ఎక్సైజ్సీఐకు కాల్చేసి వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.
ఆడియోల్లో ఏముందంటే?
‘ఓ ఆఫీసర్ గా వైన్‌షాపుల నుంచి లిక్కర్తెప్పించుకోమని బెల్ట్‌షాపుల నిర్వాహకులకు ఎలా చెబుతారు. లీగల్‌గా ఏదైనా పత్రాలు ఉంటే చూపించండి’ అంటూ బార్ నిర్వాహుకుడు ఎక్సైజ్ఆఫీసర్ను నిలదీశాడు. ఆఫీసర్స్పందిస్తూ ‘మీ ఇష్టమున్నవారికి ఫిర్యాదు చేసుకోండి’ అని బదులిచ్చారు. ఆ సంభాషణ సోషల్‌మీడియాలో వైరల్ అయింది. మరో దానిలో ఎక్సైజ్ఆఫీసర్ బార్ నిర్వహుకుడికి కాల్ చేసి రికార్డింగులు వాట్సాప్ గ్రూపుల్లో ఎందుకు వైరల్ చేస్తున్నావని బెదిరించారు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ‘అసలు నువ్వు లైసెన్స్ హోల్డర్‌వే కాదు’ అని ఆఫీసర్ అనగా, ‘మరి డబ్బు కోసం నాకేందుకు ఫోన్ చేశారు’ అని బార్ నిర్వాహకుడు ప్రశ్నించాడు.
‘నిన్ను డబ్బు అడిగినట్లు ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేసుకోవచ్చు’ అని ఆఫీసర్ చెప్పగా, ఆధారాలు ఉన్నాయని బార్ నిర్వాహుకుడు బదులిచ్చాడు. మరో ఆడియోలో.. ‘ఏటా ఆఫీసర్లకు ఇవ్వాల్సినవి ఇవ్వాలి. లేదంటే, ఎన్ ఫోర్స్మెంట్టీమ్ను పంపిస్తాం. ఇచ్చేవాటిని ఆలస్యం చేస్తే ఏదో ఒక కేసు పెట్టడం ఖాయం’అని ఎక్సైజ్ఆఫీసర్ బెదిరించినట్లు ఉంది. కాగా ఎక్సైజ్ ఆఫీసర్లు అక్రమంగా వైన్‌షాపుల నుంచి రూ. 18 వేలు, బెల్ట్ షాపుల నుంచి రూ. 6 వేలు, బార్ల నుంచి రూ. 10వేలు మామూళ్లు వసూలు చేస్తున్నట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాదికి ఒకసారి రూ.50 వేలకు పైగా వసూలు చేస్తున్నారని, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆడియోల విషయమై జగిత్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్శ్రీధర్ను అడగగా, తమ దృష్టికి రాలేదని తెలిపారు. పూర్తిస్థాయి విచారణ చేశాక వివరాలు చెబుతామన్నారు.