హైదరాబాద్, వెలుగు: డైమండ్ జ్యువెలరీ బ్రాండ్ ఔకేరా హైదరాబాద్‌లో నాలుగు కొత్త స్టోర్‌లను ప్రారంభించినట్లు ప్రకటించింది. సోమాజిగూడలో ఇది వరకే స్టోర్‌ని నిర్వహిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఇనార్బిట్ మాల్‌లలో స్టోర్లను తెరిచింది. ఔకేరా ల్యాబ్‌లో తయారు చేసిన వజ్రాలను అందిస్తుంది.
సుపీరియర్ కట్, క్లారిటీ, కలర్, కాస్ట్ ఎఫీషియెన్సీపై ఔకేరా దృష్టి సారించింది. వజ్రాల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ స్టోర్లను తెరిచామని ఔకేరా వ్యవస్థాపకుడు ఒలిసా ముఖేద్కర్ అన్నారు.