రూ.15 లక్షల కోట్లకు ఎన్‌‌‌‌‌‌పీఎస్ ఏయూఎం

రూ.15 లక్షల కోట్లకు ఎన్‌‌‌‌‌‌పీఎస్ ఏయూఎం

న్యూఢిల్లీ : నేషనల్ పేమెంట్ సిస్టమ్ (ఎన్‌‌‌‌పీఎస్‌‌‌‌) మేనేజ్ చేస్తున్న మొత్తం ఫండ్స్ (అసెట్స్‌‌‌‌) (అసెట్‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌–ఏయూఎం)   విలువ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రూ. 15 లక్షల కోట్లకు చేరుకుంటుందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌డీఏ)  చైర్మన్‌‌‌‌  దీపక్ మహంతి అన్నారు.  ఎన్‌‌‌‌పీఎస్‌‌‌‌ ఇంటర్మీడియరీస్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ను ఆయన  లాంచ్ చేశారు. ఈ అసోసియేషన్‌‌‌‌లో పెన్షన్ ఫండ్ మేనేజర్లు,  పెన్షన్‌‌‌‌ ఏజెంట్లు,  సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీలు వంటివి ఉంటాయి.  

పెన్షన్‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో మొత్తం సబ్‌‌‌‌స్క్రయిబర్ల సంఖ్య 8 కోట్ల (6.4 కోట్ల అటల్ పెన్షన్‌‌‌‌ యోజన సబ్‌‌‌‌స్క్రయిబర్లను కలిపి) ను దాటిందని, ఇందులో ఎన్‌‌‌‌పీఎస్‌‌‌‌ సబ్‌‌‌‌స్క్రయిబర్ల సంఖ్య 1.6 కోట్లుగా ఉందని దీపక్‌‌ వివరించారు.  ఈ 1.6 కోట్ల సబ్‌‌‌‌స్క్రయిబర్లలో 62 లక్షల మంది ప్రైవేట్ సెక్టార్ నుంచి ఉన్నారని,  18 లక్షల మంది కార్పొరేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌ నుంచి ఉన్నారని అన్నారు.