ఇల్లరికం అల్లుడితో గొడవ .. హత్య చేసిన అత్త, మామ, భార్య

ఇల్లరికం అల్లుడితో గొడవ .. హత్య చేసిన అత్త, మామ, భార్య
  • మర్మాంగాలపై దాడి చేసి గొంతు నులిమి మర్డర్​
  • గద్వాల జిల్లా గొర్లఖాన్ దొడ్డి గ్రామంలో ఘోరం  

గద్వాల, వెలుగు : ఇల్లరికం వచ్చిన అల్లుడిని అత్త, మామ, భార్య  కలిసి చంపారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల ఎస్ఐ మల్లేశ్​ కథనం ప్రకారం.. అయిజ మండలం ఎక్లాస్ పురం గ్రామానికి చెందిన నరసింహులు(35)తో గట్టు మండలం గొర్లఖాన్ దొడ్డి గ్రామానికి చెందిన జయమ్మకు కొన్నేండ్ల కింద పెండ్లయ్యింది. తర్వాత నరసింహులు ఇల్లరికం వచ్చి అత్తమామ ఇంట్లోనే భార్యతో కలిసి ఉంటున్నాడు. 

కాగా, శనివారం రాత్రి అత్త, మామతో నరసింహులు గొడవ పడ్డాడు. దీంతో అత్త, మామలు అల్లుడి మర్మాంగాలపై తీవ్రంగా కొట్టారు. భార్య కూడా వారికి సహకరించింది. తర్వాత  అందరూ కలిసి గొంతు నులిమి చంపి ఇంటి ముందు పడుకోబెట్టారు. ఆదివారం రాత్రి నరసింహులు తల్లిదండ్రులకు చనిపోయాడని సమాచారం ఇచ్చారు.  వారు వచ్చి డెడ్​బాడీని పరిశీలించగా మృతుడి ప్రైవేట్ పార్ట్స్ దెబ్బతిని ఉన్నాయి. గొంతుపై గాయాలు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ భీమ్ కుమార్ పరిశీలించారు.