
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నటి అనసూయ తాజాగా చేసిన ఓ కామెంట్ వైరల్ గా మారింది. గత కొన్ని రోజులుగా ఆమెను కొంతమంది ఆంటీ అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది తనను అలా పిలుస్తున్నారని సైబర్ కంట్రోల్లో కూడా కంప్లైంట్ చేసినట్టు సమాచారం. దీంతో ఆమపై ట్రోల్ చేసే వారు రోజురోజూకూ ఎక్కువవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇన్స్ స్టాగ్రామ్ లో ఏమైనా అడగండని అంటూ.. పోస్ట్ చేయగా.. చాలా మంది ఇన్ స్టా ఫాలోవర్లతో పాటు పలువురు పలు రకాలుగా ప్రశ్నలు సంధించారు. అందులో కొన్ని సాధారణ ప్రశ్నలు కాగా.. మరికొన్ని ఆమె వ్యక్తిగతానికి సంబంధించినవి ఉన్నాయి.
ఈ చాట్ లో ఓ వ్యక్తి "అక్కా మిమ్మల్ని ఎవరైనా ఆంటీ అంటే ఎందుకు అంత కోపం వస్తుందంటూ ప్రశ్నించారు. దానికి అనసూయ స్పందిస్తూ.. ఎందుకంటే వాళ్ల అర్హతలు వేరే ఉంటాయి కాబట్టి. ఎనీ వే.. ఇప్పుడు ఇప్పుడంత కోపం రావట్లేదు. అది వాళ్ల కర్మకే వదిలేస్తున్నా..." అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో అనసూయ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.