
- స్కీంలలో కాదు స్కాంలలో నెంబర్ వన్
- ఔరాద్ ఎమ్మెల్యే ప్రభు చౌహన్
నారాయణ్ ఖేడ్, వెలుగు: దేశంలోనే జూటా ముఖ్యమంత్రి కేసీఆర్ అని, బీఆర్ఎస్ ప్రభుత్వం స్కీంలలో కాదు స్కాంలో నెంబర్ వన్ అని ఔరాద్ ఎమ్మెల్యే ప్రభు చౌహన్ ఆరోపించారు. సోమవారం పట్టణంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చాడని ఎద్దేవా చేశారు.
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడన్నారు. నారాయణఖేడ్ లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. కార్యక్రమంలో విట్టల్, సంగప్ప. విజయపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి. జయశ్రీ, రంగారెడ్డి, జగన్, జైపాల్ రెడ్డి. రవికుమార్ గౌడ్, రజనీకాంత్. నగేశ్, యాదవ్, మాణిక్ పాల్గొన్నారు.