- ఔరంగజేబ్ గోల్కొండ రాజ్యాన్ని క్రీ.శ.1687లో ఆక్రమించాడు.
- చిట్టచివరి గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ తానీషా క్రీ.శ.1699లో దౌలతాబాద్ కోటలో బందీగా ఉన్నప్పుడు మరణించాడు.
- అబుల్ హసన్ తానీషా మృతదేహాన్ని ఖుర్దాబాద్లో అతని గురువు షారాజుకట్టల్ సమాధి పక్కన సమాధి చేశారు.
- గోల్కొండ సుల్తానులు పాలించిన ప్రాంతాలు క్రీ.శ.1687 నుంచి క్రీ.శ.1724 మొఘల్ వైస్రాయ్‌ల పాలనలో ఉంది.
- ఔరంగజేబ్ గోల్కొండను ఆక్రమించిన తర్వాత తాత్కాలిక రాజప్రతినిధిగా రాహుల్లాఖాన్ను నియమించారు.
- రాహుల్లాఖాన్ తర్వాత ఔరంగజేబ్ హైదరాబాద్ పరిపాలనా బాధ్యతను ఖాన్సిఫర్ఖాన్కు అప్పగించారు.
- కౌలాస్, ఎల్లందల్, కోయిలకొండ, వరంగల్, పానగల్ కోటలకు ఖాన్సిఫర్ఖాన్ మరమ్మతులు చేయించాడు.
- మొఘల్ వైస్రాయి ఖాన్సిఫర్ఖాన్ కాలంలో హైదరాబాద్, కర్ణాటకల్లో తొమ్మిది ఫౌజ్దారులు ఉండేవారు.
- కుతుబ్ షాహీల కాలంలో జమీందార్లు పొందిన పన్నులు వసూలు చేసే అధికారులను ఇజారాలు అనేవారు.
- మొఘల్ వైస్రాయిల కాలంలో సర్కారులను జిల్లాలుగా విభజించారు. జిల్లా అధికారిని దేశ్‌ముఖ్ అనేవారు.
- ఇజారా పద్ధతిని హైదరాబాద్ దివాన్ మహమ్మద్ షఫీ రద్దు చేశాడు.
- క్రీ.శ. 1702లో 50 వేల మంది మరాఠాలు తారాబాయి నాయకత్వంలో హైదరాబాద్‌పై దండెత్తి దోచుకున్నారు.
- ఔరంగజేబ్ పాలనలో హైదరాబాద్ సుబాను బాలాఘాట్ లేదా పైన్ఘాట్ అని పిలిచేవారు.
- క్రీ.శ.1708లో షా ఆలంకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో గోల్కొండ సుల్తాన్‌గా ఔరంగజేబ్ కుమారుడు కాంబక్ష్ ప్రకటించుకున్నాడు.
- కాంబక్ష్కు వ్యతిరేకంగా ఎదురుతిరిగిన నాయకుల్లో ముఖ్యుడు సర్వాయి పాపన్న. ఈయనది వరంగల్ జిల్లా ఖిలాషాపూర్. ఆయన స్వగ్రామం తారికొండ.
- తారికొండ తర్వాత సర్వాయి పాపన్న షాపూర్లో కోటను నిర్మించాడు.
- కొలనుపాక వద్ద జరిగిన యుద్ధంలో పాపన్న అనుచరుడి చేతిలో ఆ ప్రాంత ఫౌజ్దార్ ఖాసీంఖాన్ హతమయ్యాడు.
- క్రీ.శ.1702లో భారీ సైన్యంతో పాపన్న స్థావరంపై దాడి చేసిన హైదరాబాద్ సుబా డిప్యూటీ గవర్నర్ రుస్తుందిల్ఖాన్.
- క్రీ.శ.1708, ఏప్రిల్ 1న సర్వాయి పాపన్న వరంగల్ కోటను ఆక్రమించుకున్నాడు.
- మొదటి బహదూర్షాకు కాంబక్ష్కు హైదరాబాద్ పరిసరాల్లో క్రీ.శ.1709లో యుద్ధం జరిగింది.
- పాపన్నను రాజుగా గుర్తించి మొఘల్ చక్రవర్తి మొదటి బహదూర్ షా గౌరవించాడు.
- పాపన్నను బందీగా పట్టుకొని ఫౌజ్దార్ యూసఫ్‌ఖాన్ హత్య చేశాడు.
- మొఘల్ చక్రవర్తి మొదటి బహదూర్ షా తర్వాత ఫరూక్ సియార్ (క్రీ.శ.1713 నుంచి క్రీ.శ.1719) సింహాసనాన్ని అధిష్టించాడు.
- ఫరూక్ సియార్ కాలంలో దక్కన్ సుబా, హైదరాబాద్ పరిపాలన బాధ్యతలను సమర్థవంతులైన సర్ధారులు ముబ్రేజ్ఖాన్, మీర్ ఖమురుద్దీన్ నిర్వహించారు.
- 1713, జూన్‌లో హైదరాబాద్ పాలకునిగా ముబ్రేజ్ఖాన్ను ఫరూక్సియార్ నియమించారు. ఇతని పాలనలో మరాఠాలు కృష్ణమల్హర్ నాయకత్వంలో హైదరాబాద్‌పై దండెత్తారు.
- చెంగపెట్టా కోటకు ముబ్రేజ్ఖాన్ ఫారూఖ్‌నగర్ అని పేరు పెట్టాడు.
- బహదూర్ షా మరణానంతరం కింగ్ మేకర్లుగా హసన్ అలీ, హుస్సేన్ అలీ అనే సయ్యద్ సోదరులు కింగ్ మేకర్లుగా అవతరించారు.
- 1691లో ఆధోని దుర్గాన్ని మొఘల్ సేనలు ఆక్రమించినప్పుడు నిజాం ఉల్ ముల్క్కు ఔరంగజేబ్‌కు ఇచ్చిన బిరుదు చిన్ ఖిలిచ్ ఖాన్.
- క్రీ.శ.1700 నుంచి 1707 మధ్య కాలంలో ఖమ్రుద్దీన్ బీజాపూర్ ప్రాంతానికి సుబేదారుగా ఉండేవాడు.
- మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్ క్రీ.శ.1713లో ఖమ్రుద్దీన్‌ను దక్కన్ సుబేదార్‌గా నియమించాడు.
- క్రీ.శ.1722లో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా వద్ద నిజాం ఉల్ ముల్క్ వజీర్ గా నియమితులయ్యాడు.
- ఢిల్లీ పాదుషా మహమ్మద్ షా ప్రతినిధి అయిన ముబ్రేజ్ఖాన్ను నిజాం ఉల్ ముల్క్ ఓడించి, చంపిన చారిత్రక యుద్ధం క్రీ.శ.1724, అక్టోబర్ 1న బీరార్లోని షకర్ఖేడా వద్ద జరిగింది.
- నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ రాజ్యాన్ని క్రీ.శ.1724 నుంచి 1748 వరకు పాలించాడు.
- దక్కన్లో అసఫ్‌జాహీల పాలనకు పునాది పడిన సంవత్సరం క్రీ.శ.1724.