న్యూఢిల్లీ: మహిళల కోసం సుప్రసిద్ధ వస్త్ర సంస్ధ టీసీఎన్‌ఎస్ క్లాతింగ్ కంపెనీ తమ ఎథ్నిక్ వేర్ బ్రాండ్ ‘‘ఔరెలియా’’ కోసం బాలీవుడ్ నటి అలియా భట్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది. తన అందం.. అభినయంతో అద్భుతమైన నటనాచాతుర్యం పరంగా మాత్రమే కాదు, తన ఫ్యాషన్ అభిరుచుల పరంగా కూడా మంచి పేరు పొందిన అలియా ఇప్పుడు భారతీయ ఎథ్నిక్ వేర్ బ్రాండ్‌కు ప్రచారం చేయనున్నారు.
అలియా భట్ తో తమ భాగస్వామ్యం గురించి టీసీఎన్‌ఎస్ క్లాతింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ కుమార్ దాగా మాట్లాడుతూ ‘‘అలియా భట్‌తో ఒప్పందం చేసుకోవడమనేది వ్యూహాత్మక నిర్ణయం అన్నారు. ఔరెలియా ఎల్లప్పుడూ సౌకర్యవంతమైన శైలిని ప్రోత్సహిస్తూనే, మహిళలు తమదైన అందానికి ప్రాతినిధ్యం ఎంచుకోవాల్సిందిగానూ ప్రోత్సహిస్తుందన్నారు. స్ర్కీన్‌పై మాత్రమే కాదు, వెలుపల కూడా అదే తరహా భావాలను అలియా ప్రదర్శిస్తుందనే నమ్మకంతో ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. భారతీయ మహిళల వస్త్ర మార్కెట్‌లో తమ ఆధిపత్యం చూపుతున్న ఔరెలియా, నేటి తరపు మహిళల ఎథ్నిక్ వేర్ అవసరాలను తీరుస్తుందని పేర్కొన్నారు. మా భాగస్వామ్యం సుదీర్ఘకాలం కొనసాగుతుందని ఆశిస్తున్నాం అని తెలిపారు.