అరబిందో, గ్లెన్‌‌మార్క్ మందులు వెనక్కి

అరబిందో, గ్లెన్‌‌మార్క్ మందులు వెనక్కి

న్యూఢిల్లీ: తయారీ సమస్యల కారణంగా యూఎస్ మార్కెట్‌‌లోని ఉత్పత్తులను అరబిందో ఫార్మా, గ్లెన్‌‌మార్క్  రీకాల్ చేస్తున్నాయని యుఎస్ హెల్త్ రెగ్యులేటర్ ఎఫ్‌డీఏ తెలిపింది. ఈ సంస్థ తాజా రిపోర్ట్​ ప్రకారం, హైదరాబాద్‌‌కు చెందిన డ్రగ్ మేకర్  అనుబంధ సంస్థ అరబిందో ఫార్మా యూఎస్‌‌ఏ, లక్షకుపైగా బాటిళ్ల సినాకాల్‌‌సెట్ టాబ్లెట్‌‌లను రీకాల్ చేస్తోంది. మలినాల సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకుందని యూఎస్​ హెల్త్ రెగ్యులేటర్ తెలిపింది.  ఈ ఏడాది నవంబర్ 7న క్లాస్–2  రీకాల్‌‌ను కంపెనీ ప్రారంభించింది. 

హైపర్‌‌ పారాథైరాయిడిజం చికిత్సకు సినాకాల్‌‌సెట్ మాత్రలను ఉపయోగిస్తారు. గ్లెన్‌‌మార్క్ ఫార్మాస్యూటికల్స్  యూఎస్​-ఆధారిత అనుబంధ సంస్థ యూఎస్​ మార్కెట్లో దాదాపు 90వేల బాటిళ్ల డిల్డియాజెమ్​హైడ్రోక్లోరైడ్​ట్యాబెట్లను వెనక్కి రప్పిస్తోంది. ఇది కూడా మలినాల సమస్యల వల్లే మందులను రీకాల్​ చేస్తోంది.  ఈ క్యాప్సూల్స్​ను అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగిస్తారు. కంపెనీ ఈ ఏడాది నవంబర్ 1న క్లాస్–2 దేశవ్యాప్తంగా (యూఎస్​) రీకాల్‌‌ను ప్రారంభించిందని యుఎస్ హెల్త్ రెగ్యులేటర్ పేర్కొంది.