న్యూఢిల్లీ: రూ. 750 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్లాన్‌కు తమ బోర్డు ఆమోదం తెలిపిందని అరబిందో ఫార్మా గురువారం ప్రకటించింది. మొత్తం పెయిడ్-అప్ ఈక్విటీ షేర్ క్యాపిట ల్‌లో 0.88 శాతం వరకు ఉన్న 51,36,986 షేర్ల బైబ్యాక్‌కు కంపెనీ బోర్డు గ్రీన్సిగ్నల్ఇచ్చింది.
ఒక్కో షేరుకు రూ. 1,460 చొప్పున మొత్తం రూ. 750 కోట్ల విలువైన షేర్లను కొంటుంది. టెండర్ ఆఫర్ రూట్ ద్వారా రూ.750 కోట్ల షేర్ బైబ్యాక్ స్కీమ్‌కు రికార్డు తేదీగా జులై 30ని నిర్ణయించినట్లు ఈ ఫార్మా సంస్థ తెలిపింది.
ఈ ఏడాది జూన్ 30 చివరి నాటికి, కంపెనీ ప్రమోటర్లకు 51.8 శాతం వాటా ఉండగా, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు), మ్యూచువల్ ఫండ్‌లు వరుసగా 16.73 శాతం 19.17 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.