అరబిందో లాభం డౌన్‌‌

అరబిందో లాభం డౌన్‌‌

హైదరాబాద్​, వెలుగు: అరబిందో ఫార్మా నికర లాభం జూన్​ 2023 క్వార్టర్లో 22.5 శాతం తగ్గి రూ. 540 కోట్లకు పడిపోయింది. అంతకు ముందు ఏడాది క్యూ1 లో కంపెనీకి రూ. 698 కోట్ల నికర లాభం వచ్చింది. రెవెన్యూ మాత్రం అంతకు ముందు ఏడాది క్యూ 1 తో పోలిస్తే తాజా క్యూ1 లో 10 శాతం పెరిగి రూ. 6,851 కోట్లకు ఎగసింది. అమెరికా, యూరప్​ ఫార్ములేషన్స్, ఏపీఐ ​బిజినెస్​ జోరు వల్లే రెవెన్యూ రెండంకెల గ్రోత్​ సాధించినట్లు అరబిందో పార్మా వెల్లడించింది. తాజా జూన్​ క్వార్టర్లో ఇబిటా 23 శాతం ఎక్కువై రూ. 1,151 కోట్లుగా రికార్డయింది. ఇదే కాలానికి ఇబిటా మార్జిన్​ కూడా మెరుగుపడి 16.8 శాతానికి చేరింది. ఆర్‌‌ అండ్ డీ​ ఖర్చు రూ. 388 కోట్లుగా ఉంది.