హైదరాబాద్, వెలుగు : అరబిందో ఫార్మాకు ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ1) లో రూ.919 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌లో వచ్చిన రూ.571 కోట్లతో పోలిస్తే 61 శాతం పెరిగింది. రెవెన్యూ రూ.6,851 కోట్ల నుంచి రూ.7,567 కోట్లకు చేరుకుంది. అన్ని బిజినెస్ సెగ్మెంట్లలో గ్రోత్ నమోదు చేశామని కంపెనీ ఎండీ కే నిత్యానంద రెడ్డి అన్నారు.
గ్రాస్ మార్జిన్స్ మెరుగుపడ్డాయని, ఎఫీషియెన్సీ పెరిగిందని పేర్కొన్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన ప్లాంట్లలో పనులు పెంచామని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పెట్టుకున్న గ్రోత్ టార్గెట్‌ను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.