వరల్డ్ కప్ లో ఆసీస్ జోరు మాములుగా లేదు. వరుసగా రెండు మ్యాచ్ లో ఓడి ఢీలా పడిన కంగారూలు ఆ తర్వాత కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఛాంపియన్ ఆట తీరు చూపిస్తూ ప్రత్యర్థులను కంగారెత్తిస్తుంది. ఈ క్రమంలో వరుసగా నాలుగో ఓటమిని తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. ధర్మశాలలో న్యూజిలాండ్ పై జరుగుతున్న మ్యాచ్ లో పరుగుల వరద పారించి ఆ జట్టుకు భారీ స్కోర్ సెట్ చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 388 పరుగులు చేసింది. హెడ్ 67 బంతుల్లోనే 110 పరుగులు చేయగా..వార్నర్ 65 బంతుల్లో 81 పరుగులు చేసాడు. వార్నర్,హెడ్ టీ 20 తరహాలో రెచ్చిపోతూ స్కోర్ బోర్డును పరుగుల పెట్టించారు. కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తొలి వికెట్ కు 19 ఓవర్లలోనే 175 పరుగులు జోడించి ఆసీస్ ను పటిష్ట స్థితిలో నింపారు.
మధ్యలో వికెట్లను కోల్పోయినా చివర్లో కెప్టెన్ కమ్మిన్స్ (14 బంతుల్లో 37), ఇంగ్లీష్(28 బంతుల్లో 38) వేగంగా ఆడి ఆసీస్ కు భారీ స్కోర్ అందించారు. కివీస్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, బోల్ట్ మూడు వికెట్లు తీసుకోగా.. సాంట్నర్ కు రెండు, నీషం,హెన్రీలకు ఒక వికెట్ దక్కింది.
#Australia vs #NewZealand, 27th Match
— Ariana Television (@ArianaTVN) October 28, 2023
AUS 388 (49.2) CRR: 7.86
Innings Break
To Watch Australia vs New Zealand, Live, Please visit the link below:https://t.co/azBR6pxOAB
Live is available only in Afghanistan and please make sure you are not using VPN.… pic.twitter.com/HeDFg58y40