IND vs AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ.. గబ్బా టెస్టుకు వర్షం ముప్పు?

ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పోరు రసవత్తరంగా సాగుతోంది. పెర్త్ గడ్డపై టీమిండియా విజయం సాధిస్తే.. అడిలైడ్‌లో ఆతిథ్య ఆసీస్ 10 వికెట్ల తేడాతో రోహిత్ సేనను చిత్తు చేసి సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇప్పుడు మూడో పోరుకు సమయం ఆసన్నమైంది. శనివారం నుంచి బ్రిస్బేన్ వేదికగా ఈ ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ కీలక టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 

బుధవారం బ్రిస్బేన్  నగరంలో 75.8మీటర్ల వర్షపాతం నమోదైంది. గురువారం కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు AccuWeather  అంచనా వేసింది. దీనికి తోడు టెస్ట్ మ్యాచ్ జరగనున్న ఐదు రోజుల్లో నాలుగు దినాలు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇదే అభిమానులను కలవపాటుకు గురి చేస్తోంది. కీలక పోరు ఎక్కడ వర్షార్పణం అవుతోందో అన్న భయం అభిమానులను వెంటాడుతోంది.  

ALSO READ | Team India: జైస్వాల్‌పై బీసీసీఐ సీరియస్.. అడిలైడ్ హోటల్లో ఏం జరిగింది..?

బ్రిస్బేన్ టెస్ట్ ఐదు రోజుల వాతావరణం

డే 1 (డిసెంబర్ 14): స్థానిక కాలమానం ప్రకారం, శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో 60 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని BBC వెదర్ అంచనా వేసింది. ఈ కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. AccuWeather మొదటి రోజు గరిష్టంగా 88 శాతం వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

డే 2 (డిసెంబర్ 15): BBC వెదర్ ప్రకారం, ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో 70 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. AccuWeather ఆదివారం ఉదయం పూట 55 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

డే 3 (డిసెంబర్ 16): మూడో రోజు కాస్త మెరుగ్గానే ఉంది. వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు చాలా తక్కువ. BBC వెదర్ ప్రకారం మూడో రోజు మ్యాచ్ జరిగే సమయాల్లో వర్షం అంచనా 12 శాతం నుండి 34 శాతం మధ్య ఉంది.

డే 4 (డిసెంబర్ 17): BBC వెదర్ ప్రకారం నాలుగో రోజు ఆట సమయాల్లో 35 శాతం వర్షపాతం వచ్చే అవకాశం ఉందని అంచనా. AccuWeather కూడా నాల్గవ రోజు వర్షం కురిసే అవకాశాలు 42 శాతం ఉన్నట్లు అంచనా వేసింది.

డే 5 (డిసెంబర్ 18): ఐదవ రోజు వాతావరణం క్లియర్ గా ఉంది. పగటిపూట సూర్యుడు కనిపించనున్నాడు. BBC వెదర్ ప్రకారం సాయంత్రం వేళ వర్షం కురిసే అవకాశం ఉంది. కానీ ఆ సమయానికి ఆట పూర్తి కావొచ్చు.