Aus vs Pak: భారత్ అడుగుజాడల్లోనే పాకిస్తాన్.. ఆస్ట్రేలియా చేతిలో పరాజయం

Aus vs Pak: భారత్ అడుగుజాడల్లోనే పాకిస్తాన్.. ఆస్ట్రేలియా చేతిలో పరాజయం

ఒకవైపు దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా, మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్తాన్.. రెండు జట్లు  ఒకరి అడుగుజాడల్లో మరొకటి నడుస్తున్నాయి. అసియన్ దేశాలైన మనమిద్దరం ఒకే రకమైన ఆట ఆడాలన్నట్లు ఓటమి బాటలో పయనిస్తున్నాయి. సఫారీ పర్యటనలో భారత జట్టు తొలి టెస్టులో ఘోర ఓటమిని చవిచూస్తే, ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ ఏకంగా టెస్ట్ సిరీస్‌నే కోల్పోయింది.  

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టు(బాక్సింగ్ డే టెస్ట్)లో పాకిస్తాన్ 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 317 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 237 రన్స్‌కే కుప్పకూలింది. దీంతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకుంది.

Test cricket, there is simply NOTHING like it!

An incredible day for our Aussie men as they secured the Boxing Day Test, and the series against Pakistan. Bring on Sydney!

Get your tickets to The Pink Test here: https://t.co/G8wMgQpIEM pic.twitter.com/YkGCctRxIc

— Cricket Australia (@CricketAus) December 29, 2023

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగుల వద్ద ఆలౌటైంది. మార్నస్ లబుషేన్(63), డేవిడ్ వార్నర్(38), ఉస్మాన్ ఖవాజా(42), మిచెల్ మార్ష్ (41) రాణించారు. అనంతరం పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 264 పరుగులే పరిమితమైంది. ఓపెనర్ అబ్దుల్ షఫీక్(62), కెప్టెన్ షాన్ మసూద్(54), మహమ్మద్ రిజ్వాన్(42) పర్వాలేదనిపించారు. దీంతో ఆసీస్ కు తొలి ఇన్నింగ్స్‌లో  54 పరుగుల ఆధిక్యం లభించింది.

అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 262 పరుగుల వద్ద ఆలౌట్ కాగా, తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో కలుపుకొని పాక్ కు 317 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఒకానొక సమయంలో ఈ లక్ష్యాన్ని చేధించేలా కనిపించిన మన దాయాది జట్టు చివరలో బోల్తాపడింది. కెప్టెన్ షాన్ మసూద్(60), అఘా సల్మాన్(50) హాఫ్ సెంచరీలు చేయగా.. బాబర్ ఆజామ్(41) పరుగులు చేశాడు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్(5/48, 5/49) రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 10 వికెట్లు తీశాడు.

ఈ ఇరు జట్ల మధ్య జనవరి 3 నుంచి మూడు టెస్ట్ ప్రారంభంకానుంది.

Australia win the second Test by 79 runs.#AUSvPAK pic.twitter.com/nRYnHujU8W

— Pakistan Cricket (@TheRealPCB) December 29, 2023