ఓటమిని గొప్పగా చెప్పుకోవటం అనేది బహుశా! ఎక్కడ వినుండరు. ఆ ఘనత దాయాది దేశం పాకిస్తాన్‌కే చెల్లుతుంది. ఎంత వెర్రితనం కాకపోతే ఓటమిపై పొగడ్తలు ఏంటి..? మెరుగైన క్రికెట్ ఆడారంటూ ఆటగాళ్లపై ప్రశంసలు ఏంటి..? చెప్పండి. ఓడినందుకు సొంత అభిమానుల చేత చీవాట్లు తినకుండా వేసిన ఎత్తుగడలివి.
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టు(బాక్సింగ్ డే టెస్ట్)లో పాకిస్తాన్ 79 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 317 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 237 రన్స్‌కే కుప్పకూలింది. దీంతో ఆసీస్ మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది. ఈ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు పాక్ టీమ్ డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ ఎత్తుగడలు వేశాడు. ఓడినప్పటికీ.. తమ ఆటగాళ్లు మెరుగైన క్రికెట్ ఆడారని, తమ ఆటతో అభిమానుల మనసులు గెలుచుకున్నారని తెలిపాడు.
మ్యాచ్ అనంతరం మీడియా సమేవేశంలో పాల్గొన్న హఫీజ్.. "ఓటమి గురుంచి మాకు బాధలేదు. మేము మెరుగైన క్రికెట్ ఆడాం.. అందుకు గర్విస్తున్నాం. మా వాళ్లు ఆడిన తీరు అసాధారణం. ప్రత్యర్థి జట్టు కంటే మెరుగ్గా ఆడారు. మా బ్యాటింగ్ కూడా మెరుగు పడింది. కాకపోతే బౌలింగ్ లో కొన్ని లోపాలున్నాయి. సరైన ప్రాంతాలలో బంతులు వేయలేకపోయాం. ఫీల్డింగ్ లో కొన్ని పొరపాట్లు చేశాం. అది ఓటమికి దారితీసింది. మ్యాచ్ గెలవడానికి ఈ మాత్రం కష్టం సరిపోతుంది.." అని హఫీజ్ చెప్పుకొచ్చాడు.
Mohammed Hafeez - Pakistan played better cricket than the other team.
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 29, 2023
Pat Cummins - Ahh, cool. It doesn't really matter, does it? It's the team who wins at the end. pic.twitter.com/V7bmOG1qUh
హఫీజ్ చేసిన ఈ వ్యాఖ్యలను మీడియా మిత్రులు కమ్మిన్స్ ముందు ప్రస్తావించగా అతడు పాకిస్తాన్ ఆటగాళ్లపై సెటైర్లు వేశాడు. "కూల్.. అవును, వారు బాగా ఆడారు.. మాకు విజయం లభించింది. అందుకు సంతోషంగా ఉంది.." అని బదులిచ్చాడు. రిపోర్టర్ ఇంకేదో చెప్పమని అతన్ని పట్టుబట్టడంతో కమ్మిన్స్ నవ్వులు పంచేలా మరో సమాధానం కూడా ఇచ్చాడు. "వారి మాటలు అర్థం లేనివి. మీ ప్రశ్నలు అర్థం లేనివి. చివరవరకూ బాగా ఆడిన జట్టే గెలుస్తుంది.." అని హఫీజ్ చచెంప చెల్లుమనేలా బదులిచ్చాడు. వీరిద్దరి సంభాణపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది.
Team Director Mohammad Hafeez says inconsistent umpiring and curse of technology resulted in Pakistan's defeat in the second Test in Australia ?
— Farid Khan (@_FaridKhan) December 29, 2023
Do you agree with it? #AUSvsPAK pic.twitter.com/pYC4Zvexbq