మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో తొలి రోజు 66 ఓవర్లు ఆట మాత్రమే సాగింది. ఆట ముగిసేసమయానికి ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ పావురాల గుంపు మైదానంలోకి చొచ్చుకురాగా.. వాటిని తరిమికొట్టేందుకు ఇరు జట్ల ప్లేయర్లు పరుగులు తీశారు. ఆ ఉల్లాసకరమైన సంఘటన ప్రేక్షకులకు నవ్వులు పంచింది.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ మూడో సెషన్‌లో ఉన్నట్టుండి మైదానంలోకి ఓ పావురాల గుంపు వచ్చింది. ఆ సమయంలో స్ట్రయిక్‌లో ఉన్న స్మిత్ వాటిని చూసి పక్కకు జరిగాడు. వెంటనే పావురాలు ఆటంకం కలిగించాయని గ్రహించిన నాన్ స్ట్రయికర్ లబూషేన్ బ్యాట్ పట్టుకొని వాటి వెంట పరుగులు తీశాడు. గాల్లోకి బ్యాట్ ఊపుతూ వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేశాడు. అతనికి సహాయంగా స్మిత్, హసన్ అలీ కూడా వాటి వెంట పరుగులు తీశారు. దీంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Scenes at MCG pic.twitter.com/5qt6Ib1Ack
— Dr.M.Tahir (@dr_tahiryousuf) December 26, 2023
Fun moment for hassan and labuschagne
— flamingo ? (@asad_naureen) December 26, 2023