ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ పేసర్ షాహిన్ ఆఫ్రిది ఐదు వికెట్లతో చెలరేగాడు. కీలక సమయాల్లో మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్ స్టోయినిస్ వికెట్లు తీసి ఆసీస్‌ను భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. దీంతో అతని ప్రదర్శనపై భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ పొగడ్తలు కురిపించారు. ప్లాట్ పిచ్ పై ఐదు వికెట్లు తీయడమంటే.. అసాధారణం అని పొగిడారు.
"బెంగళూరు వంటి ఫ్లాట్ పిచ్‌లో 5 వికెట్లు తీశాడంటే షాహీన్ అఫ్రిది అద్భుతంగా బౌలింగ్ చేసినట్లే. కాకపోతే ఆజట్టులో అతను తప్ప మిగిలిన బౌలర్లంతా నిరుపయోగం.." అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశారు. ఈ మ్యాచ్‌లో అఫ్రిదికి మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ వికెట్లు దక్కాయి.
On this flat Bengaluru pitch getting a 5 wicket haul is top effort by Shaheen Afridi. Apart from him Pakistan bowling looking toothless! #PAKvAUS
— Irfan Pathan (@IrfanPathan) October 20, 2023
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మార్ష్(121), వార్నర్(163) సెంచరీలు చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 367 పరుగుల భారీ స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా.. హరీస్ రౌఫ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 8 ఓవర్లలో 83 పరుగులిచ్చాడు. ఇక వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఉసామా మీర్ 9 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ పడగొట్టి 82 పరుగులిచ్చాడు.
Second World Cup five-wicket haul for @iShaheenAfridi! ?
— Pakistan Cricket (@TheRealPCB) October 20, 2023
2️⃣nd ?? bowler to take two World Cup five-fers after Shahid Afridi ?#AUSvPAK | #DattKePakistani | #WeHaveWeWill pic.twitter.com/iIhk9sSLYH